AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమయం లేదు మిత్రమా.. గడువు సమీపిస్తోంది.. జూలై 31 చివరి అవకాశం.. లేకుంటే జేబుకు చిల్లులే..

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్‌.. ట్యాక్స్‌ పేయర్స్‌కు ఐటీఆర్‌ ఫైల్‌ చేసేందుకు గడువు సమీపిస్తోంది. జూలై 31 వరకు గడువు ఉంది. ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఐటీఆర్‌ ఫైల్ చేయడంలో వైఫల్యం సమస్యలకు దారి తీస్తుంది...

సమయం లేదు మిత్రమా.. గడువు సమీపిస్తోంది.. జూలై 31 చివరి అవకాశం.. లేకుంటే జేబుకు చిల్లులే..
Itr
Subhash Goud
|

Updated on: Jul 28, 2024 | 4:37 PM

Share

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్‌.. ట్యాక్స్‌ పేయర్స్‌కు ఐటీఆర్‌ ఫైల్‌ చేసేందుకు గడువు సమీపిస్తోంది. జూలై 31 వరకు గడువు ఉంది. ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఐటీఆర్‌ ఫైల్ చేయడంలో వైఫల్యం సమస్యలకు దారి తీస్తుంది. అందుకే మీరు పన్ను రిటర్నులను ఫైల్ చేయడం చాలా ముఖ్యం. జూలై 31 చివరి తేదీ అయితే మీరు కొంత పెనాల్టీ చెల్లించినప్పటికీ ఐటీఆర్‌ ఫైల్ చేయడం మర్చిపోవద్దు. ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించేందుకు సరిపడా ఆదాయం లేకపోవడంతో ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. ఇది తప్పు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయకపోతే జరిగే పరిణామాల గురించి తెలుసుకుందాం.

  1. జరిమానా వడ్డీ: సెక్షన్ 234A ప్రకారం నిర్ణీత వ్యవధిలోపు పన్ను చెల్లించకపోతే, మీకు చెల్లించాల్సిన పన్ను మొత్తంలో నెలవారీ 1 శాతం ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ పెనాల్టీగా వసూలు చేయబడుతుంది.
  2. పెనాల్టీ చెల్లించాలి: సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూ. 5,000 జరిమానా విధిస్తారు. వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల లోపు ఉంటే ఆలస్య రుసుము వెయ్యి రూపాయలు మాత్రమే. మీ ఆదాయం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేసినందుకు ఎలాంటి జరిమానా ఉండదు.
  3. నష్టాన్ని బదిలీ చేయడం సాధ్యం కాదు: మీరు మీ ఐటీఆర్‌ని ఆలస్యంగా ఫైల్ చేస్తే, షేర్ లావాదేవీల నుండి వచ్చే నష్టాలను, F&O ట్రేడింగ్ నుండి వచ్చే నష్టాలను మీరు ఫార్వార్డ్ చేయలేరు. అంటే ఈ నష్టాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో జమ చేయలేము. అయితే ఇంటి ఆస్తి అమ్మకంలో నష్టాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది.
  4. ట్యాక్స్‌ రీఫండ్‌ సమస్య: మీరు అదనపు పన్ను చెల్లించినట్లయితే మీరు ఐటీఆర్‌ ఫైల్ చేసి వాపసు పొందవచ్చు. మీరు వడ్డీతో పాటు వాపసు పొందుతారు. ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేసినట్లయితే తిరిగి చెల్లించాల్సిన పన్ను మొత్తానికి వడ్డీ జోడించరు. మీరు ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయనట్లయితే పన్ను శాఖకు అందుబాటులో ఉన్న మీ సమాచారం ప్రకారం అసెస్‌మెంట్ చేయబడుతుంది. మీకు ఎక్కువ పన్ను భారం పడే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు పాత పన్ను విధానాన్ని ఎంచుకుని, ఈ సంవత్సరం ఐటీఆర్‌ ఫైల్ చేయకుంటే, మీరు కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ చేస్తారు. తదుపరిసారి మీరు ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి వెళ్లినప్పుడు మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకోలేరు.
  5. ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్‌ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్