AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New iPhone: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. రూ.50,000 కంటే తక్కువ ధరలో యాపిల్‌ న్యూమోడల్‌..! ఎప్పుడంటే..

యాపిల్ కంపెనీ తన కస్టమర్ల కోసం త్వరలో తక్కువ ధరకే ఐఫోన్‌ను ప్రవేశపెట్టనుందని సమాచారం. రూ.50,000 కంటే తక్కువ ధరకే ఈ ఐఫోన్ లభ్యం కానుందని, ఈ బడ్జెట్ శ్రేణి ఐఫోన్ అందరికీ బెస్ట్‌ డీల్‌ అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ ఐన్‌ఫోన్‌ iPhone SE 4 మార్కెట్లోకి వస్తుందోనని ఐఫోన్‌ ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

New iPhone: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. రూ.50,000 కంటే తక్కువ ధరలో యాపిల్‌ న్యూమోడల్‌..! ఎప్పుడంటే..
Affordable Iphone
Jyothi Gadda
|

Updated on: Dec 11, 2023 | 1:12 PM

Share

Apple కంపెనీ తన నెక్ట్స్ iPhone (iPhone SE 4)ని ఎప్పుడు విడుదల చేస్తుందోననే ఉత్కంఠ, ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉంటే ఐఫోన్ ప్రియులకు గొప్ప శుభవార్త అందుతోంది. యాపిల్ త్వరలో తక్కువ ధరకే ఐఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. యాపిల్ కంపెనీ తన కస్టమర్ల కోసం త్వరలో తక్కువ ధరకే ఐఫోన్‌ను ప్రవేశపెట్టనుందని వార్త వచ్చింది.. రూ.50,000 కంటే తక్కువ ధరకే ఈ ఐఫోన్ లభ్యం కానుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అసలు విషయం ఏంటో వివరాల్లోకి వెళితే…

iPhone SE 4: iPhone SE 4 కి సంబంధించి కొంత సమాచారం లీక్ అయింది. iPhone SE 4 2024 జనవరి నుంచి మార్చి మధ్యలో విడుదల కావచ్చననే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి, iPhone SE 3 ఫీచర్లు, డిజైన్‌లు ప్రజలు ఊహించినంత ప్రజాదరణ పొందలేదు. అయితే, కొత్త మోడల్‌లో డిజైన్ మరియు కొన్ని విషయాలు మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఐఫోన్ ధర రూ.50 వేల లోపే ఉండవచ్చని అంచనా.

iPhone SE 4 ఫీచర్లు: iPhone SE 4 డిజైన్ iPhone 14 మాదిరిగానే ఉంటుందని ఈ లీక్‌లు సూచిస్తున్నాయి. దీనర్థం దిగువన బటన్‌లు ఉండవు. స్క్రీన్ చుట్టూ విశాలమైన బ్లాక్ బార్‌లు కూడా ఉండవు. స్క్రీన్, బదులుగా ఫుల్‌ బాడీతో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఐఫోన్ SE 4 రూపకల్పన మరింత ఆధునికంగా, మరింత స్మార్ట్‌గా ఉంటుంది. అయితే, మునుపటి ఐఫోన్ మోడల్స్ లాగానే, ఈ iPhone SE 4 పైభాగంలో నాచ్ ఉంటుంది. ఈ నాచ్ కెమెరా, సెన్సార్ మరియు స్పీకర్ కోసం కూడా స్పెస్‌ ఇచ్చారు. OLED డిస్‌ప్లే మెరుగైన వీడియో, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పారు.

iPhone SE 4 బ్యాటరీ: లీకైన సమాచారం ప్రకారం, ఈ iPhone SE 4 బ్యాటరీ iPhone 14 బ్యాటరీ వలె ఉంటుంది. ఈ బడ్జెట్ శ్రేణి ఐఫోన్ అందరికీ బెస్ట్‌ డీల్‌ అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ ఐన్‌ఫోన్‌ iPhone SE 4 మార్కెట్లోకి వస్తుందోనని ఐఫోన్‌ ప్రియులు అతృతగ ఎదురు చూస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..