Metro Train: మెట్రోలో ఇదేం లొల్లిరా నాయనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైటింగ్.. పంచులతో రెచ్చిపోయారు

ఈ వైరల్ క్లిప్‌లో మెట్రో కోచ్ గేట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు గొడవ పడటం ముందుగా మనం చూడవచ్చు. ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటున్నారు. ప్రయాణికులంతా ఈ ఫైట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, కొన్ని పంచ్‌ల తర్వాత, ఇద్దరు కుర్రాళ్ళు గొడవను ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం తప్పక వీడియోలో చూడాల్సిందే..

Metro Train: మెట్రోలో ఇదేం లొల్లిరా నాయనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైటింగ్..  పంచులతో రెచ్చిపోయారు
Metro Fight
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 11, 2023 | 12:32 PM

ఢిల్లీ మెట్రోకు స్వాగతం..ఈ సారి ఢిల్లీ మెట్రోకు సంబంధించి మరో వినూత్న వీడియో తెరమీదకు వచ్చింది. ఈ సారి మెట్రోలో పెద్ద యుద్ధమే జరిగింది. మెట్రో నిర్వాహకులు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి వెకిలి, వింత చేష్టల కారణంగా మెట్రో ప్రయాణికుల్లో కోపం పెరిగిపోతోంది. మెట్రో లోపల జరుగుతున్న రోజుకో గొడవ, వివాదం, తగాదాలు ప్రయాణికుల్ని తీవ్ర ఆందోళన, నిరాశకు గురి చేస్తుంది. తాజాగా అలాంటిదే మరో వీడియో మెట్రోలో భీకర పోరాటానికి సంబంధించి వైరల్‌గా మారింది. మెట్రో ట్రైన్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అసలు విషయంలోకి వెళితే..

వైరల్‌ అవుతున్న మెట్రోలో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. ఈ గొడవను మిగతా ప్రయాణికులు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కొందరు యువకులు కేకలు, అరుపులతో వారికి చీర్స్ చెబుతున్నట్టుగా కనిపించింది. కొందరు మాత్రం వారి గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో సంఘటన మొత్తాన్ని కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్ అయ్యింది.

ఈ వైరల్ క్లిప్‌లో మెట్రో కోచ్ గేట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు గొడవ పడటం ముందుగా మనం చూడవచ్చు. ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటున్నారు. ప్రయాణికులంతా ఈ ఫైట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, కొన్ని పంచ్‌ల తర్వాత, ఇద్దరు కుర్రాళ్ళు గొడవను ఆపడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఈ ఫైట్ ఏ మెట్రో లైన్‌లో జరిగిందో సరిగా నిర్ధారణ కాలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఈ వీడియోని Instagram హ్యాండిల్ @abhijeet_roy___ ద్వారా పోస్ట్ చేయగా,ఈ వీడియోకు ఇప్పటికే 76 లక్షలకు పైగా వ్యూస్, 1 లక్షా 38 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఫైట్ వీడియోను చూసిన తర్వాత మూడు వేల మందికి పైగా వినియోగదారులు స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..