Digital Payments: మీ పిల్లలు డిజిటల్‌ లావాదేవీలు చేస్తున్నారా? ముందు ఈ విషయాలు వివరించండి

ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. ఇంట్లో కూర్చుని బ్యాంకు లావాదేవీలు చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మారుతున్న కాలానుగుణంగా దేశంలో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. ప్రస్తుతం లావాదేవీలు అన్ని కూడా డిజిటల్‌ విధానంలో మారిపోయాయి. ఏటీఎం వెళ్లకుండా, బ్యాంకుకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని లావాదేవీలు చేసేస్తున్నాము. అలాంటి సమయంలో డిజిటల్‌ విధానాన్ని కూడా పిల్లలకు నేర్పించాల్సిన..

Digital Payments: మీ పిల్లలు డిజిటల్‌ లావాదేవీలు చేస్తున్నారా? ముందు ఈ విషయాలు వివరించండి
Digital Payments
Follow us
Subhash Goud

|

Updated on: Dec 11, 2023 | 3:31 PM

ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. ఇంట్లో కూర్చుని బ్యాంకు లావాదేవీలు చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మారుతున్న కాలానుగుణంగా దేశంలో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. ప్రస్తుతం లావాదేవీలు అన్ని కూడా డిజిటల్‌ విధానంలో మారిపోయాయి. ఏటీఎం వెళ్లకుండా, బ్యాంకుకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని లావాదేవీలు చేసేస్తున్నాము. అలాంటి సమయంలో డిజిటల్‌ విధానాన్ని కూడా పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో పేమెంట్స్ విధానం చాలా విప్లవాత్మకంగా మారిపోయింది. ఇప్పుడు దాదాపుగా డబ్బును జేబులో లేదా పర్స్ లో పెట్టుకుని తిరిగే వారు ఎవరూ లేరంటే అది అతిశయోక్తి కాదు. డిజిటల్ పేమెంట్ విధానంలో కూరగాయల నుంచి కూలర్ల వరకూ కొనుక్కునే పరిస్థితి. చిల్లర లేదనే బాధ లేదు.. డబ్బు పోతుందనే భయం లేదు. పర్స్ కొట్టేస్తారనే చింతా లేదు. మొబైల్ ఫోన్ చేతిలో ఉంటె చాలు పేమెంట్ అయిపోతుంది. డెబిట్ కార్డ్ వినియోగం కూడా బాగా తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ విషయంలోనూ డిజిటల్ విధానం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలకు పాకెట్ మనీ ఇచ్చినా చాలా పేమెంట్స్ కోసం వారు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం సర్వసాధారణం అయిపొయింది. కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్ చేసే పరిస్థితి లేకపోవడం.. ఆన్ లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే డిజిటల్ పేమెంట్ విధానమే తప్పనిసరి కావడం పిల్లలకు కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు పిల్లల్లో డిజిటల్ గా డబ్బు ఖర్చు చేయడం.. పొదుపు చేయడం అలవాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

పిల్లలకు డెబిట్‌కార్డ్‌,డిజిటల్‌ వాలేట్ల పరిచయం:

పిల్లలకు డెబిట్ కార్డ్.. డిజిటల్ వాలేట్లను పరిచయం చేయాలి. వీటిని వారు ఉపయోగించడం వలన కొన్ని ఇబ్బందులు ఉండే మాట వాస్తవం కానీ.. అవగాహన పెంచితే వారు దీనిని జాగ్రత్తగా ఉపయోగించగలరు. ఎందుకంటే, పిల్లలు టెక్నాలజీ నేర్చుకోవడం పెద్దల కంటే చాలా ముందుంటారు. డిజిటల్ పేమెంట్స్ గురించి పిల్లలకు ఎలా నేర్పించాలి అనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాండి:

డిజిటల్‌ విధానానికి సంబంధించి అన్ని విషయాలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా మంచిది. డెబిట్ కార్డ్ ద్వారా అలాగే డిజిటల్ గా పేమెంట్ చేయాలంటే ముందుగా డబ్బు అందులోకి ఎలా వస్తుంది అనే విషయాన్ని వారికి అర్ధం అయ్యేలా చెప్పాలి. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది వివరించాలి. డబ్బు ఉంది కదా అని కనబడిన వస్తువు కొనేసే అలవాటు కాకుండా చూసుకోవాలి. వారికి డెబిట్ కార్డ్ లో కొంత మొత్తం ఏర్పాటు చేసి.. దానిని బడ్జెట్ చేసుకోమని చెప్పాలి. ఉదాహరణకు 1000 రూపాయలు ఒకటో తేదీన వారి ఎకౌంట్ లో క్రెడిట్ చేయాలి. దానిని ఎలా ఖర్చు పెడతారు అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పమనండి. మీ పిల్లల నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయమని అడగండి. ఉదాహరణకు, మీరు వారికి నోట్‌ప్యాడ్‌ను కొనివ్వచ్చు.

ఇవి కూడా చదవండి

నెలవారీ ఖర్చులను నోట్ చేసుకోండి:

అక్కడ వారు వారి నెలవారీ ఖర్చులన్నింటినీ నోట్ చేసుకోవచ్చు. ఆ వెయ్యిరూపాయలు బడ్జెట్ లో ఏదైనా మార్పులు సూచించాలి అనుకుంటే సూచించండి. ఇప్పుడు వారు దాని ప్రకారం ఖర్చు చేస్తున్నారా? లేదా అనే దానిని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు వారి ఖర్చులన్నిటికీ సరిపడా డబ్బు కూడా వారి ఎకౌంట్ లో ఉంచవచ్చు. దానిని వారినే ఖర్చు చేయమని చెప్పవచ్చు. దీనివలన రూపాయి రూపాయి ఎలా ఖర్చు అవుతుంది అనే విషయం వారికీ అవగాహన వస్తుంది. తనకు ఎంత ఖర్చు అవుతుంది అనే స్పష్టత వారికీ ఉంటుంది.

నెల చివరలో పిల్లలతో కూర్చుని చర్చించండి:

నెల చివరలో పిల్లలతో కూచుని చర్చించండి. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేశారు? దానిని ఎలా అదుపు చేసుకోవచ్చు వివరించండి. వారి ఖర్చుల్లో ఉపయోగం లేనివి ఏమిటి? అనే విషయాన్ని వారికీ అర్ధం అయ్యేలా చెప్పండి. బడ్జెట్ లో డబ్బు మిగుల్చుకుని వాటిని ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించండి. నెలకు వందరూపాయలు ఏదైనా సేవింగ్స్ స్కీం లో పెడితే సంవత్సరం చివర ఎంత వస్తుందో చెప్పండి. అనవసర ఖర్చులు చేయకుండా డబ్బు దాచుకుంటే అది మరికొంత డబ్బును ఇస్తుంది అనే విషయం వారికీ అర్ధం అవుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ వంటి సాధారణ సేవింగ్స్ విధానాలను వారికి పరిచయం చేయండి. అలాగే ఈ డబ్బు-పొదుపు పరిష్కారాలు భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని సమీకరించడంలో ఎలా సహాయపడతాయో వారికి వివరిస్తుంది.

అలాగే, పిల్లలు కూడా కచ్చితంగా మీరు అనుకున్నట్టే చేస్తారనీ లేదు. క్రమేపీ అలవాటు అవుతుంది. మీరు ఎప్పుడైతే డెబిట్ కార్డ్ వారికీ ఇచ్చారో.. అప్పుడే ఆర్థిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. మీరు వారికి డెబిట్ కార్డ్ ఇచ్చినప్పుడు, డబ్బు అనే విలువైన వనరును జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను వారికి ఇస్తున్నందున మీరు వారి మెచ్యూరిటీని కూడా అంగీకరిస్తున్నారని వారికీ తెలుస్తుంది.

పొదుపు గురించి నేర్పించండి:

సాధనతో పొదుపు అలవాటు వస్తుంది. కాబట్టి, మీ పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ ప్రాథమికాలను నేర్పించడం తొందరపాటు అని అనుకోవద్దు. చిన్న పిల్లలు వారికేం తెలుస్తుంది అనేది వదిలేయండి. వారికే అన్నివిషయాలు బాగా అర్ధం అవుతాయి. మీరు చెప్పే విధానాన్ని బట్టి వారు అర్థం చేసుకుంటారని గుర్తించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి