Ather 450X: ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇటీవల కాలంలో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు దెబ్బకు ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇటీవల ఏథర్ కంపెనీ స్కూటర్లు ప్రత్యేక పనితీరుతో ఈవీ ప్రియుల మనస్సును దోచేస్తున్నాయి. కొత్త ఏడాది ఏథర్ 450 ఎక్స్‌లో న్యూ కలర్స్ లాంచ్ చేసింది.

Ather 450X: ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
Ather 450x
Follow us
Srinu

|

Updated on: Jan 01, 2025 | 4:15 PM

ఏథర్ ఎనర్జీ 2025లో రెండు కొత్త కలర్ స్కీమ్లతో 450 సిరీస్‌ను అప్డేట్ చేసింది. ఏథర్ బ్రాండ్ డార్క్ నేవీ బ్లూ, ఎల్లో కలర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త కలర్ స్కీమ్‌లు రిజ్టాలో బాగా ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో ఏథర్ 450 ఎక్స్ మోడల్‌లో కూడా ఏథర్ కంపెనీ సేమ్ కలర్స్‌ను లాంచ్ చేసింది. ఈ అప్‌డేటెడ్ కలర్ వెర్షన్‌లో జెన్3 450 సిరీస్ మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్‌ను కూడా కూడా పొందవచ్చు. ఈ విషయాన్ని కోయంబత్తూరు ఏథర్ డీలర్స్ స్పష్టం చేశారు. ఏథర్ తాజాగా తన ట్రాక్ అటాక్ ఈవెంట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.  ఈ ఈవెంట్‌లో 450× 160 సీసీ మోటార్ సైకిల్, ఒక 125 సీసీ ఐసీఈ పవర్డ్ స్కూటర్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ జనవరి 4న యూట్యూబ్‌లో లైవ్ రానుంది. 

ఏథర్ ఎనర్జీ ఈ సంవత్సరం ప్రారంభంలో ఐపీఓకు వెళ్లడానికి సెబీ వద్ద ఒక అభ్యర్థనను సమర్పించింది. ఆ అభ్యర్థనను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. రెగ్యులేటరీ అథారిటీ వివిధ రంగాలకు చెందిన మరో ఆరు కంపెనీలతో కలిసి ఏథర్ ప్రతిపాదనను ఆమోదించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ప్రతిపాదించిన ఐపీఓ దాని ప్రమోటర్లు, పెట్టుబడిదారుల వాటాదారుల ద్వారా 2.2 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)తో పాటు 3,100 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేస్తుంది. ఓఎఫ్ఎస్‌లో పాల్గొనే సంస్థల్లో కలాడియం ఇన్వెస్ట్మెంట్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్-II, 3 స్టేట్ వెంచర్స్, ఐఐటీఎం ఇంక్యుబేషన్ సెల్, ఐఐటీఎంఎస్ రూరల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఉన్నాయి.

ఏథర్ ఎనర్జీ ఒక ఫ్యాక్టరీని స్థాపించడానికి ఐపీఓ ద్వారా సేకరించిన నిధులతో మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ ప్రయత్నాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ కార్యకలాపాలలో పెట్టుబడులు పెట్టేందుకు మూలధన వ్యయాలకు కేటాయిస్తారు. ఆగస్టులో 6,145 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తర్వాత పబ్లిక్ మార్కెట్ లోకి ప్రవేశించాలనుకుంటున్న రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థగా ఏథర్ నిలిచింది. రెండు దశాబ్దాల తర్వాత భారతదేశంలో ఆటోమోటివ్ తయారీదారులు అందించిన మొదటి ఆఫర్ ఇదే. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి