Viral Video: వీడు అదో టైపు.. ఒంటరిగా కనబడితే చెంపలు పగలగొట్టేస్తున్నాడు..

 ఓ యువకుడి వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒంటిరిగా కనిపిస్తే చాలు వారిని చెంపపై గట్టిగా కొట్టి పారిపోతున్నాడు. ఇలా ఎందరినో చెంపలు వాయించేశాడు. చివరికి ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం నెట్టింట చేరి వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడు రోడ్డుమీద ఒంటరిగా కనబడితే చాలు.. వారిని చెంపపై గట్టిగా కొట్టి పారిపోతున్నాడు. అయితే, ఓ బాధితుడి ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు స‌ద‌రు యువ‌కుడిని పట్టుకున్నారు. అత‌నిపై బీఎన్ఎస్ సెక్షన్ 115 కింద కేసు న‌మోదు చేశారు.

Viral Video: వీడు అదో టైపు.. ఒంటరిగా కనబడితే చెంపలు  పగలగొట్టేస్తున్నాడు..
Man Slapping Pedestrians
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2025 | 3:24 PM

యూపీలోని మీరట్‌కు చెందిన కపిల్‌ కుమార్‌ అనే యువకుడు గత కొద్ది నెలలగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసి చెంపలు వాయిస్తున్నాడు. బాధితులకు తేరుకునేలోపే బైకుపై అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నాడు. ఇలా ఇప్పటివరకు చాలా మందిని వాయించేశాడు. తాజాగా కపిల్ కుమార్.. రిటైర్డ్ PCS అధికారికి కూడా తన చేతి దెబ్బ రుచి చూపించాడు.  ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. బైకుపై వెనుక నుంచి వచ్చి.. ఎడమ చేతితో గట్టిగా చెంప వాయించాడు. ఆయన వయస్సు మీదపడిన వ్యక్తి కావడంతో కపిల్‌ కుమార్‌  కొట్టిన దెబ్బకు కిందపడిపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటన.పై వృద్ధుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంట‌నే స్పాట్‌కు వెళ్లి పరిశీలించారు. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీ విజువల్స్‌ చెక్ చేసి.. నిందితుడు కపిల్‌ కుమార్‌గా గుర్తించారు. అనంత‌రం అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

కపిల్‌ కుమార్‌పై ఇలా చెంపదెబ్బలు కొట్టడంపై 3 కేసులు నమోదయినట్లు  పోలీసులు తెలిపారు. కపిల్‌ కుమార్‌ తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయారని.. ఇటీవలే అతని తల్లి రెండో పెళ్లి చేసుకుందని, ఇతను తన తల్లి, సవతి తండ్రితో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతను డిప్రెషన్‌కి లోనయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. కపిల్ మానసిక పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు అతను ప్రస్తుతం ‘డోపమైన్ రష్’ అనే మానసిక రుగ్మత‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అతడికి ట్రీట్మెంట్ చాలా అవసరమని చెప్పారు. క‌పిల్‌ను మరికొన్ని రోజులు అలాగే వదిలేస్తే తీవ్ర డిప్రెషన్‌కు గురై.. బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడే ప్రమాదం ఉందన్నారు. దాంతో పోలీసులు తగిన చికిత్స చేయించాలని చెప్పి నిందితుడి తల్లిదండ్రులకు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..