SIP Investment: సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.. !

జీవితంలో ప్రతి ఒక్కరికీ సక్రమమైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. దాని ద్వారానే భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని ఇబ్బందులను అధిగమించగలం. వచ్చే ఆదాయంలో కొంత పొదుపు చేసి, దాన్ని పెట్టుబడిగా పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో రాబడిని పొందవచ్చు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్డడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటిలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా ప్రతినెలా కొంత మొత్తంలో పెట్టుబడులు పెట్టవచ్చు.

SIP Investment: సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.. !
Follow us
Srinu

|

Updated on: Jan 01, 2025 | 4:30 PM

కేవలం రూ.వెయ్యి కంటే తక్కువ డబ్బులతో ఎస్ఐపీల్లో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈ సొమ్ముతో స్టాక్ మార్కెట్ లో షేర్లను ఎంఎఫ్ మేనేజర్ కొనుగోలు చేస్తారు. సిప్ విధానంలో షేర్లను కొని, అత్యధిక రాబడిని సంపాదించడానికి ఈ కింద తెలిపిన చిట్కాలు పాటిస్తే చాలు. సిప్ లో పెట్టుబడులను చాలా తొందరగా ప్రారంభించాలి. ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లోనే మొదలు పెట్టడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి సంపాదించే వీలుంటుంది. మొక్కను నాటి, దాని సంరక్షిస్తే పెద్దదైన తర్వాత పండ్లను ఇస్తుంది. దాని మాదిరిగానే సిప్ లో పెట్టుబడులను జాగ్రత్తగా పెడితే కొంత కాలానికి మంచి ఆదాయం అందిస్తాయి. క్రమంగా తప్పకుండా ప్రతి నెలా డబ్బులను పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. మధ్యలో మానేయడం, రెండు, మూడు నెలలకు ఒక్కసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల రాబడి అంతగా ఉండదు. సిట్ లో ప్రతినెలా పెట్టుబడి పెట్టడం మీ జీవితంలో భాగం కావాలి.

మ్యూచువల్ ఫండ్స్ లో అనేక రకాలు ఉంటాయి. సిప్ లో పెట్టే డబ్బులన్నింటినీ ఒకే రకమైన ఫండ్ పై ఇన్వెస్ట్ చేయకూడదు. ఈక్విటీ, డెట్, హైబ్రీడ్ తదితర పోర్టు పోలియోలకు విస్తరించాలి. ఒకే రకమైన వాటిపై వెచ్చిస్తే లాభాలు రాకపోవచ్చు. ఉద్యోగంలో కాలక్రమీణా మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. దానికి అనుగుణంగానే సిప్ పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లాలి. అప్పడే దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ మెంట్లు ఎక్కువై, రాబడి కూాడా అధికంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో రాబడి పొందాలంటే దీర్ఘకాలం వేచి ఉండాలి. ఎక్కువ కాలం రేసులో నిలబడాలి. ముందస్తు ఉప సంహరణల వల్ల తగిన లాభాలు ఉండవు.

ఫండ్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాలి. మార్కెట్ కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఫండ్ పనితీరు తక్కువగా ఉంటే, వెంటనే పోర్టు పోలియోను మార్చుకోవడం చాలా అవసరం. స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం చాాలా అవసరం. మొదట్లో తెలియకపోయినా క్రమంగా దానిలో లోటుపాట్లు తెలుస్తాయి. దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందటానికి మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉపయోగపడతాయి. కొంచెం రిస్టు ఉన్నప్పటికీ మంచి లాభాలను తెచ్చిపెడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి