Indian Cofee: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ కాఫీకి పెరుగుున్న ఆదరణ.. ఫస్ట్ టైమ్ దాటేసిన బెంచ్ మార్క్!
2024లో గ్లోబల్ ధరల పెరుగుదల ట్రెండ్ భారతీయ కాఫీ రంగం ఎక్కువగా లాభపడింది. ప్రధానంగా బ్రెజిల్, వియత్నాం వంటి పెద్ద ఉత్పత్తిదారుల నుండి పరిమిత సరఫరా కారణంగా భారతీయ కాఫీకి డిమాండ్ పెరిగింది. అక్కడ అనిశ్చిత వాతావరణం ఉత్పత్తిని బాగా ప్రభావితం చేసింది. దీని వల్ల భారత్ లాభపడింది. ఇప్పుడు ఈ ట్రెండ్ కొత్త సంవత్సరంలో కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
సాంప్రదాయకంగా టీ ఎగుమతిదారు, భారతదేశం గ్లోబల్ కాఫీ ఎగుమతి మార్కెట్లోకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు మొత్తం ఎగుమతులతో మొదటి సారిగా ఒక బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇందుకు సంబంధించి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) తాజా గణాంకాలు విడుదల చేసింది. భారతీయ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. విదేశాల్లో ఇక్కడ అనిశ్చిత వాతావరణం ఉత్పత్తిని బాగా ప్రభావితం చేసింది. దీని వల్ల భారత్ లాభపడింది. ఇక ట్రెండ్ కొత్త సంవత్సరంలో కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
2020లో ప్రపంచ ఉత్పత్తిలో 3% వాటాతో ఉన్న భారతదేశం.. ప్రస్తుతం టాప్ 10 కాఫీ ఉత్పత్తి దేశాలలో ఒకటిగా నిలిచింది. 2022లో భారతీయ కాఫీ మార్కెట్ విలువ 478 మిలియన్ డాలర్లు, 2024-2033లో 9.87% CAGRతో 2032 నాటికి 1,227.47 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రపంచ ఉత్పత్తిలో 40 శాతానికి పైగా వాటా కలిగిన రోబస్టా కాఫీ ధరలు పెరగడం, అలాగే యూరోపియన్ యూనియన్ కొత్త అటవీ నిర్మూలన నియంత్ర చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అంతకుమముందే నిల్వ ఉంచినడం వల్ల కాఫీ ధర పెరగడంతోపాటు అనేక ఇతర అంశాలు కూడా ఈ వృద్ధికి కారణమయ్యాయి.
2022 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఉత్పత్తిలో 6% వాటాతో 2021-22లో భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా అవతరించింది. 2023 నాటికి భారతీయ కాఫీ ఎగుమతుల విలువ 1.12 బిలియన్ డాలర్లు. 2023 సంవత్సరానికి కాఫీ ఎగుమతులు 2022 సంవత్సరానికి కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన 1.08 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అధిగమించాయి. ఇక భారతదేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ఇది దేశంలోని కాఫీ ఉత్పత్తిలో 71% వాటాను కలిగి ఉంది. భారతదేశంలోని కాఫీలో 33% కర్ణాటకలోని కొడగు జిల్లా మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలోని కాఫీలో 21% ఉత్పత్తి చేసే కేరళ తర్వాత అత్యధిక కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం కాఫీలో కర్ణాటక, కేరళ కలిసి 90% ఉత్పత్తి చేస్తాయి. తమిళనాడు 5% ఉత్పత్తి చేస్తూ భారతదేశంలో మూడవ అతిపెద్ద కాఫీ ఉత్పత్తి రాష్ట్రంగా ఉంది. ఇవి కాకుండా, ఈశాన్య భారతదేశం, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాఫీని పండిస్తున్నారు.
దేశంలో మారుతున్న అభిరుచులు, ప్రాధాన్యతలు, మారుతున్న ప్రజల జీవనశైలి కాఫీకి డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కాఫీ చెయిన్‌లు, కేఫ్‌లతో సహా అనేక కారణాల వల్ల భారతదేశంలో కాఫీకి డిమాండ్ పెరుగుతోంది. భారతీయ రిటైల్ కాఫీ మార్కెట్ గత రెండేళ్లలో సుమారుగా 20% వృద్ధిని సాధించింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మార్కెట్ ఏటా 20% కంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అంచనా. దేశంలో ఇన్‌స్టంట్ కాఫీ పెరుగుతున్న ట్రెండ్ కూడా దేశీయంగా కాఫీ వినియోగంలో వృద్ధిని పెంచింది. కాఫీ వినియోగం పెరగడం కేవలం మెట్రో నగరాలకే పరిమితం కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాఫీ తాగే వారి సంఖ్య పెరుగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..