IRCTC Booking: సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్.. ఈ టిప్స్ పాటిస్తే చాలంతే..!

భారతదేశంలో రైలు ప్రయాణాన్ని సామాన్యులు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారు కచ్చితంగా సౌకర్యంగా ఉంటుందని రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే రైలు టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కోసారి రైల్వే వెబ్‌సైట్ పని చేయకపోతే ఇబ్బందిపడతారు. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పనిచేయకపోయినా టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలో? తెలుసుకుందాం.

IRCTC Booking: సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్.. ఈ టిప్స్ పాటిస్తే చాలంతే..!
Train
Follow us
Srinu

|

Updated on: Jan 01, 2025 | 4:00 PM

ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణికుల సహనాన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ బాగా పరీక్షిస్తుంది. ఏకంగా గంటల తరబడి సైట్ పని చేయడం లేదు. ముఖ్యంగా తత్కాల్ టికెట్ ప్రయాణికులకైతే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ చుక్కలు చూపుతుంది. గత నెల వివరాల్లోకి వస్తే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ డిసెంబరు 9న, డిసెంబర్ 26న చాలా సేపు స్టక్ అయిపోయింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుంచి లక్షలాది మంది ప్రయాణికులు తమ తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోబోతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మళ్లీ ఉదయం 11:17 నిమిషాల తర్వాత సైట్ ఆటోమెటిక్‌గా పని చేసింది. 

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ నిలిచిపోయిన సమయంలో ప్రయాణీకులు పీఆర్ఎస్ కౌంటర్ ద్వారా తమ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) అనేది రైల్వే స్టేషన్లలో ఉన్న టిక్కెట్ బుకింగ్ విండో. ఇది కంప్యూటరైజ్డ్ సిస్టమ్. ఇది ప్రయాణీకులు ఆన్‌లైన్‌లో లేదా పీఆర్ఎస్ కౌంటర్లలో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మరియు రద్దు చేయడానికి అనుమతిస్తుంది. పీఆర్ఎస్ కౌంటర్లు వారాంతాల్లో తప్ప ప్రతిరోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే పని గంటలు ఒక్కో ప్రదేశానికి మారుతూ ఉంటాయి. ఐఆర్‌సీటీసీ  వినియోగదారులు తమ రైలు టిక్కెట్లను రద్దు చేయడానికి టీడీఆర్‌ను ఫైల్ చేయాలి. టిక్కెట్ రద్ద చేయడానికి అంటే టీడీఆర్ కోసం దయచేసి కస్టమర్ కేర్ నంబర్‌లు 14646, 08044647999 & 08035734999 లేదా etickets@irctc.co.inకి మెయిల్ చేయవచ్చు.

నవంబర్‌లో ఐఆర్‌సీటీసీ తన కొత్త టిక్కెట్ బుకింగ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ప్రయాణికులు తమ టిక్కెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చు. రైలు బుకింగ్‌ల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ఏఆర్‌పీ) 120 రోజుల ముందు ఉండేది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి