Gold Price Today: తగ్గేదేలే.. అంటున్న బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన రేట్లు.. తులం ఎంత పెరిగిందంటే..?

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, బంగారం ధరలు మళ్లీ పెరగగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం (మే 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: తగ్గేదేలే.. అంటున్న బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన రేట్లు.. తులం ఎంత పెరిగిందంటే..?
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 25, 2023 | 8:50 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, బంగారం ధరలు మళ్లీ పెరగగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం (మే 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,250 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,360 గా ఉంది. తులం బంగారంపై రూ.250 మేర ధర పెరిగింది. కాగా, కిలో వెండి ధర రూ.450 మేర తగ్గి రూ.74,050 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,510 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,050 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,050, చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500, బెంగళూరులో రూ.77,500, కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.74,050, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500, విజయవాడలో రూ.77,500, విశాఖపట్నంలో రూ.77,500 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..