Gold Price Today: బంగారం కొనే వారికి భారీ షాక్‌.. కొండెక్కుతున్న ధరలు.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

బంగారం కొనే వారికి షాకింగ్‌ న్యూస్‌.. గత వారం వరకు భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ కొండెక్కుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 10 గ్రాముల బంగారంపై రూ.1450 పెరగడం గమనార్హం. ఇక మంగళవారం (అక్టోబర్‌ 10)తో పోలిస్తే బుధవారం (అక్టోబర్‌ 11) మరోసారి రూ. 300 మేర పెరిగింది. బుధవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది.

Gold Price Today: బంగారం కొనే వారికి భారీ షాక్‌.. కొండెక్కుతున్న ధరలు.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold Price Today
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2023 | 6:32 AM

బంగారం కొనే వారికి షాకింగ్‌ న్యూస్‌.. గత వారం వరకు భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు మళ్లీ కొండెక్కుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 10 గ్రాముల బంగారంపై రూ.1450 పెరగడం గమనార్హం. ఇక మంగళవారం (అక్టోబర్‌ 10)తో పోలిస్తే బుధవారం (అక్టోబర్‌ 11) మరోసారి రూ. 300 మేర పెరిగింది. బుధవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 300 పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 330 మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 53,650కి చేరుకోగా 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,530 వద్ద కొనసాగుతోంది. మరి బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 58,530గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 53,650 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,650 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,530 గా ఉంది.

ఇతర ప్రధాన నగరాల్లో..

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,650గా ఉంది.

* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 53,800కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 58,690గా ఉంది.

* ఇక ఢిల్లీలో 22 క్యారెట్స్ ధర రూ. 53,800 కాగా, 24 క్యారెట్స్‌ గొల్డ్‌ ధర రూ. 58,680గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్‌ ధర రూ. 53,650కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.

* కేరళలో 22 క్యారెట్స్‌ ధర రూ. 53,650గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,530గా ఉంది.

నిలకడగా కొనసాగుతోన్న వెండి ధరలు

బంగారం ధరతో పోలిస్తే.. ఇవాళ కూడా వెండి ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 75,500 చేరుకోగా విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లోనూ ఇదే ధర పలుకుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 72,600గా ఉంది. అటు కోల్‌కతా, ముంబైలలో కూడా ఇదే ధరకు అందుబాటులో ఉంది. అటు బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,500గా ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,500 లకు చేరుకుంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..