Gold Price: భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళి నాటికి రికార్డ్‌ సృష్టించనుందా?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ ఇటీవల నుంచి మళ్లీ పెరగడం మొదలైంది. శుక్రవారం దేశ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధరలు దాదాపు రూ. 550 తగ్గినప్పటికీ, ధన్‌తేరస్‌కు ఒక నెల ముందు బంగారం ధరలు దాదాపు 5 శాతం పెరిగాయి. దీపావళి నాటికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం..

Gold Price: భారీగా పెరుగుతున్న బంగారం ధర.. దీపావళి నాటికి రికార్డ్‌ సృష్టించనుందా?
gold
Follow us
Subhash Goud

|

Updated on: Sep 28, 2024 | 6:13 PM

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ ఇటీవల నుంచి మళ్లీ పెరగడం మొదలైంది. శుక్రవారం దేశ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధరలు దాదాపు రూ. 550 తగ్గినప్పటికీ, ధన్‌తేరస్‌కు ఒక నెల ముందు బంగారం ధరలు దాదాపు 5 శాతం పెరిగాయి. దీపావళి నాటికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు. ఈ ఏడాది మరో రెండు ఫెడ్‌ సమావేశాలు జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 0.50 శాతం తగ్గింపును చూడవచ్చు. దీని ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తుంది. దీపావళి నాటికి బంగారం ధర రూ.77,000 దాటే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రూ.80 వేల వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.మార్కెట్‌లో బంగారం ధరలు ఏ స్థాయిలో ట్రేడవుతున్నాయో కూడా తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Edible Oil Prices: పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు

వారంలో ఒక శాతం పెరుగుదల:

ఇవి కూడా చదవండి

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గత వారంలో బంగారం ధరలు 1 శాతానికి పైగా పెరిగాయి. వారం క్రితం పది గ్రాముల బంగారం ధర రూ.74,831 ఉండగా, శుక్రవారం పది గ్రాములు రూ.75,718కి చేరింది. అంటే ఒక నెలలో బంగారం ధరలు 1.18 శాతం పెరిగింది. అంటే పది గ్రాములకు 887 రూపాయలు పెరిగాయి. కాగా ఈ వారంలో బంగారం ధరలు కూడా రూ.76 వేల స్థాయిని దాటాయి. డేటా ప్రకారం, గురువారం, బంగారం ధరలు 10 గ్రాములకు రూ.76,527 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అదే శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,950 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,400 వద్ద నమోదైంది. ఇక కిలో వెండి ధర దేశీయంగా రూ.95,000 వద్ద ఉంది.

ధంతేరస్ కంటే ముందు పెరుగుదల

మరోవైపు ధన్‌తేరస్ కంటే ముందే బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత నెల రోజులుగా బంగారం ధర రూ.3500కు పైగా పెరిగింది. ఆగస్టు 28న మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ.72,195గా ఉంది. తర్వాత బంగారం ధరలో 5 శాతం పెరుగుదల కనిపించింది. ఈ సమయంలో బంగారం ధర రూ.3,523 పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ధన్‌తేరస్ అక్టోబర్ చివరలో ఉంది.

అయితే, శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ముగిసినప్పుడు బంగారం ధరలో పతనం కనిపించింది. గణాంకాల ప్రకారం గురువారం మార్కెట్ ముగిసే సరికి పది గ్రాముల బంగారం ధర రూ.76,253గా ఉంది. ఒకరోజు ముందు మార్కెట్ ముగింపు ధర పది గ్రాములు రూ.75,718 వద్ద కనిపించింది.

దీపావళికి బంగారం రికార్డు సృష్టిస్తుందా?

బులియన్‌ మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీపావళి నాటికి బంగారం ధరలు రూ.2 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. గతేడాది దీపావళి ప్రత్యేక ముహూర్తపు ట్రేడింగ్ సమయంలో బంగారం ధర పది గ్రాములకు రూ.59 వేలకుపైగా ఉండగా, అప్పటి నుంచి పది గ్రాముల బంగారం ధర రూ.15,966 పెరిగింది.

ఇది కూడా చదవండి: Rule Change 1st October: అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!