TATA: మరోసారి దేశానికి కీర్తిని తెస్తున్న టాటా సంస్థ.. విదేశాల్లో తొలి డిఫెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు

భారతదేశానికి మొదటి విమానయాన సంస్థ టాటా గ్రూప్ నుంచి వచ్చిందే.. అంతేకాదు మొదటి పరిశోధనా సంస్థ, మొదటి లగ్జరీ హోటల్, మొదటి స్టీల్ ప్లాంట్, మొదటి పవర్ ప్లాంట్‌ని అందించి భారత దేశానికి ఎంతో సేవలు చేసిన సంస్థ.. ఇప్పుడు టాటా గ్రూప్ పేరిట మరో రికార్డు చేరబోతోంది. టాటా గ్రూప్ విదేశాల్లో తన తొలి రక్షణ రంగ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. దీంతో ఇప్పుడు విదేశీ గడ్డపై దేశానికి సరికొత్త కీర్తిని తీసుకురానుంది.

TATA: మరోసారి దేశానికి కీర్తిని తెస్తున్న టాటా సంస్థ.. విదేశాల్లో తొలి డిఫెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు
Tatas To Set Up Defence Factory Abroad
Follow us

|

Updated on: Sep 28, 2024 | 5:50 PM

మన దేశంలో టాటా గ్రూప్ సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే.. 1868లో జామ్‌సెట్‌జీ టాటా స్థాపించిన టాటా గ్రూప్ సంస్థ దేశంలోనే అతి పెద్ద వాణిజ్య సంస్థ.. అంతేకాదు 100 దేశాలకు పైగా సేవలందిస్తోన్న ఈ టాటా గ్రూప్ వివిధ రంగాల్లో విస్తరించింది. భారతదేశానికి మొదటి విమానయాన సంస్థ టాటా గ్రూప్ నుంచి వచ్చిందే.. అంతేకాదు మొదటి పరిశోధనా సంస్థ, మొదటి లగ్జరీ హోటల్, మొదటి స్టీల్ ప్లాంట్, మొదటి పవర్ ప్లాంట్‌ని అందించి భారత దేశానికి ఎంతో సేవలు చేసిన సంస్థ.. ఇప్పుడు టాటా గ్రూప్ పేరిట మరో రికార్డు చేరబోతోంది. టాటా గ్రూప్ విదేశాల్లో తన తొలి రక్షణ రంగ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. దీంతో ఇప్పుడు విదేశీ గడ్డపై దేశానికి సరికొత్త కీర్తిని తీసుకురానుంది.

టాటా గ్రూప్ కంపెనీ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ దేశం వెలుపల కాసాబ్లాంకాలో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఫ్యాక్టరీ విదేశీ గడ్డపై మొట్టమొదటి స్వదేశీ రక్షణ కర్మాగారం అవుతుంది. ఈ ఫ్యాక్టరీ ప్రారంభంలో ఈ కర్మాగారం రాయల్ మొరాకన్ సాయుధ దళాల కోసం ప్రత్యేకమైన వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్‌ఫారమ్‌లను (WhAPs) తయారు చేస్తుంది. తరువాత ఈ కర్మాగారం మొత్తం ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులను తయారు చేస్తుంది.

ప్రతి ఏడాది వాహనాలు తయారీ

టాటా గ్రూప్‌కు చెందిన ఈ కర్మాగారంలో మొదట్లో ప్రతి సంవత్సరం 100 సాయుధ వాహనాలు ఉత్పత్తి చేయనున్నారు. ఏడాదిలోగా ఈ ఫ్యాక్టరీ సిద్ధమై అప్పుడు ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ ఫ్యాక్టరీ నుంచి మొదటి వాహనం 18 నెలల్లో రెడీ అయ్యి రిలీజ్ అవుతుంది అని ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి టాటా గ్రూప్‌కు చెందిన ఈ వాహనాలు ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత సైన్యం ఉపయోగిస్తోంది. పరిమిత సంఖ్యలో తయారు చేస్తోన్న ఈ యుద్ధ వాహనాలు భారతదేశంలోని లడఖ్ సరిహద్దులో మోహరించబడ్డాయి.

DRDO అభివృద్ధి చేసిన వాహనాలు

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) సహకారంతో WhAPని అభివృద్ధి చేసింది. మొరాకో సైన్యం ఎంపిక చేయడానికి ముందు ఈ వాహనం ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాల్లో అనేక రౌండ్ల పరీక్షలు జరిపించారు. ఆ తర్వాతే టాటా గ్రూప్‌కు ఈ కాంట్రాక్టు లభించింది.

అయితే ఈ ఒప్పందం ఎంత పెద్దది? ఇందుకోసం టాటా గ్రూప్ ఈ ఫ్యాక్టరీలో ఎంత పెట్టుబడి పెట్టింది అనే సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ ఫ్యాక్టరీలో దాదాపు 350 మందికి ఉపాధి లభించనుంది. భారత దేశంలో ఈ వాహనాల ఉత్పత్తికి సంబంధించి చాలా పనులు జరగనున్నాయి. ఈ ఫ్యాక్టరీతో టాటా గ్రూప్ ఆఫ్రికా డిఫెన్స్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక