Video Viral: అరె ఎంతకు తెగించార్రా మీరు!.. వెరైటీ కోసం ఐస్ క్రీమ్‌ని ఇలా కూడా చేస్తారా..!
వనిల్లా, చాక్లెట్, ప్రూట్ నట్ , సీతాఫలం , స్ట్రాబెర్రీలు వంటి అనేక రకాల ఐస్ క్రీమ్ లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. చల్లటి డెజర్ట్ ఐస్‌క్రీమ్ ప్రియులను ఆస్వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఐస్ క్రీమ్ ని చూస్తే ఎవరైనా షాక్ తింటారు. అదే పచ్చి మిరపకాయలతో తయారు చేసిన ఐస్‌క్రీమ్ రోల్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఐస్ క్రీమ్ పేరు వింటే చాలు పిల్లల పెద్దలు అనే తేడా లేకుండా తినడానికి ఇష్టపడతారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఎ సందర్భంలోనైనా ఎన్ని రకాల ఆహారపదార్ధాలు తిన్నా చివరిగా చల్ల చల్లగా ఐస్‌క్రీమ్ తినడానికి ఇష్టపడతారు. మారిన కాలంతో పాటు ఐస్ క్రీమ్ లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. వనిల్లా, చాక్లెట్, ప్రూట్ నట్ , సీతాఫలం , స్ట్రాబెర్రీలు వంటి అనేక రకాల ఐస్ క్రీమ్ లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. చల్లటి డెజర్ట్ ఐస్‌క్రీమ్ ప్రియులను ఆస్వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఐస్ క్రీమ్ ని చూస్తే ఎవరైనా షాక్ తింటారు. అదే పచ్చి మిరపకాయలతో తయారు చేసిన ఐస్‌క్రీమ్ రోల్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పచ్చి మిర్చి ఐస్ క్రీమ్ వీడియో
ఇవి కూడా చదవండిView this post on Instagram
చిల్లీ ఐస్ క్రీమ్ అసలు ఊహకు కూడా అందని ఓ కాంబినేషన్. ఒక వ్యక్తి కొన్ని పచ్చి మిరపకాయలను తరిగి అందులో పాలు కలుపుతూ ఐస్ క్రీమ్ డెజర్ట్ ను తయారు చేస్తున్నట్లు వీడియో చూపించింది. ఐస్ క్రీమ్ తయారీలో ఒక వ్యక్తి పచ్చి మిర్చిని ముక్కలుగా కట్ చేసి.. దానికి కొన్ని ఆకుపచ్చ సాస్ జోడించాడు. వాటిని పచ్చి మిరపకాయ చట్నీలా తయారు చేసి ఆపై అందులో కొంచెం పాలు పోసి, మిల్కీ ఐస్ క్రీం టచ్ ఇచ్చాడు. అనంతరం ఆ మిశ్రమాన్ని పదే పదే మిక్స్ చేశాడు. ఈ మిశ్రమాన్ని మెత్తగా.. కలుపుతూ గుజ్జుగా చేశాడు. తాను అనుకున్న స్టేజ్ కు ఆ మిశ్రమం చేరుకోగానే ఆ మిశ్రమాన్ని పల్చగా చేసి.. ఆపై దానిని ముక్కలుగా కట్ చేసి రోల్‌గా చుట్టి ఒక ప్లేట్ లో పేర్చాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన ఫుడ్ బ్లాగర్ భార్గవ్ చెవ్లీ మాట్లాడుతూ ఐస్‌క్రీమ్ కి న్యాయం చేశానని అని అన్నాడు. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది. 10 మిలియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఆ అసాధారణ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ గురించి తెలుసుకున్న నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. ఈ డెజర్ట్ ని తయారు చేసిన ఈ అన్నపై కేసు పెట్టండి… మేము దీనిని సహించలేకపోతున్నాం అని ఒకరు కామెంట్ చేశారు. ఇదేమి ఖర్మ అంటూ మరొకరు పచ్చి మిర్చి ఐస్ క్రీమ్ పై తమ నిరసనను వ్యక్తం చేశారు.
మరిన్ని టెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..