Reels: కొంపముంచిన డిప్యూటీ సీఎం తనయుడి రీల్స్ పిచ్చి.. ఇంతకీ ఏం జరిగిందంటే?
రాజస్థాన్ డీప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా తనయుడు ఆషు తన ఫెండ్స్‌తో కలిసి ఓ రీల్ చేశాడు. అందులో వెనుక నుంచి పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. ఓపెన్ టాప్ జీపులో వీధుల్లో తిరుగుతూ అషు చిల్ అవుతున్నాడు. ట్రాపిక్ రూల్స్ పాటించకుండా జీపును నడుపుతున్నారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియా లేకుంటే యువకులు ఉండలేరనే చెప్పాలి. కుర్రకారు సోషల్ మీడియాలో ఫేమ్ కోసం వింత చేష్టలకు పాల్పడుతున్నారు. త్వరగా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని, ఫాలోవర్స్ పెంచుకోవాలని వీడియోలు చేస్తూ ప్రాణాలు మీదికి తెచ్చకుంటున్నారు. సోషల్ మీడియాలో తాత్కాలిక సంతోషం కోసం వికృత పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అందరి దృష్టి ఆకర్షించాడని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు చేసిన వీడియోలు ట్రెండ్ అవుతుంటే మరికొందరి వీడియోలు వారి కొంప ముంచుతున్నాయి. ఆ వీడియోలు కొందరికి లాభాన్ని చేకురిస్తే మరికొందరికి తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. చేసింది ఎవరో యువకుడో అనామకుడో కాదు..రాజస్థాన్ డీప్యూటీ సీఎం కొడుకు..పోలీసుల ఎస్కార్ట్‌తో రీల్ చేశాడు. ఆ రీల్ వైరల్ కావడంతో పోలీసుల ఎస్కార్ట్‌తో రీల్ చేయడం ఏంటని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్ డీప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా తనయుడు ఆషు తన ఫెండ్స్‌తో కలిసి ఓ రీల్ చేశాడు. అందులో వెనుక నుంచి పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. ఓపెన్ టాప్ జీపులో వీధుల్లో తిరుగుతూ అషు చిల్ అవుతున్నాడు. అంతేగాక ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా జీపును నడుపుతున్నారు. ఆ ఎస్కార్ట్ వాహనాలు ఉపముఖ్యమంత్రికి చెందినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని తమ సొంత అవసరాలకు వాడుతున్నారని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకొవాలని, అలా చేస్తేనే బుద్ధి వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఉపముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా స్పందించారు. తన కొడుకుకి 18 సంవత్సరాలు నిండలేదని, భద్రత కోసం ఎస్కార్ట్ వాహనాలు వెంట ఉన్నాయని సమాధానం ఇచ్చారు. తన వల్ల పార్టీలో ఎలాంటి ఇబ్బంది రావద్దని, వారి తరుపున తాను క్షమాపణలు కోరుతున్నాట్లు చెప్పారు. ఈ విషయంపై మాజీ మంత్రి ఖాచరియావాస్ స్పందించాడు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇలానే ఉంటుందని సెటైర్ వేశారు.