AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తాం.. జమ్మూలో ప్రధాని మోదీ

జమ్మూ కాశ్మీర్‌లో ప్రచారాన్ని ముగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జమ్మూలో జరిగిన సభలో కాంగ్రెస్‌-NC కూటమిపై మండిపడ్డారు మోదీ.

PM Modi: టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తాం.. జమ్మూలో ప్రధాని మోదీ
Pm Modi
Balaraju Goud
|

Updated on: Sep 28, 2024 | 4:54 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లో ప్రచారాన్ని ముగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జమ్మూలో జరిగిన సభలో కాంగ్రెస్‌-NC కూటమిపై మండిపడ్డారు మోదీ. మూడు కుటుంబ పార్టీల పాలనతో జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు విసిగిపోయారని అన్నారు మోదీ. కాంగ్రెస్‌ హయాంలో చొరబాట్లు తరచుగా జరిగేవన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక .. టెర్రరిస్టులు ఎక్కడ నక్కినా వాళ్ల స్థావరాల మీద సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేస్తున్నామన్నారు. నవభారతంలో చొరబాట్లుకు తావులేదని , టెర్రరిస్టులకు సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో గుణపాఠం చెప్పామని మోదీ అన్నారు. ఇదే రోజు అంటే సెప్టెంబర్‌ 28వ తేదీన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. తొలిదశ పోలింగ్ సరళి చూస్తే బీజేపీ ఘనవిజయం ఖాయమనిపిస్తోందన్నారు.

అనంతరం హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం హిసార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంతర్గత కలహాలనూ ప్రధాని మోదీ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్‌లో పోరు నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. తండ్రి, కొడుకులిద్దరూ సీఎం సీటు కోసం కుస్తీ పడుతున్నారు. ఇద్దరూ కలిసి మిగతావి సెటిల్ చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ఉన్న చోట స్థిరత్వం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. నాయకుల మధ్య ఐక్యత తీసుకురాలేని పార్టీ రాష్ట్రంలో సుస్థిరతను ఎలా తెస్తుంది? హర్యానా ప్రజలు కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాల వలలో చిక్కుకోరు. దేశంలోనే అత్యంత మోసపూరిత, నిజాయితీ లేని పార్టీ కాంగ్రెస్‌ అని మోదీ ఆరోపించారు. దళితులందరినీ కాంగ్రెస్ ద్వేషిస్తోంది. కాంగ్రెస్‌లో దళితులు, వెనుకబడిన వారికి పూర్తిగా తలుపులు మూసుకుపోయాయన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ రాజకుటుంబం చెబుతోందని, వారి ఆలోచనే దళితులు, వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకమని ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..