World Heart Day: నేటి యువత ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారు? ఎలా నివారించాలో నిపుణులు సలహా ఏమిటంటే
ఈ సంవత్సరం ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29 న జరుపుకుంటున్నారు. ఈ రోజుని గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఎంపిక చేశారు. యువత గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం గుండె ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదాలను గుర్తించేందుకు ఈసీజీ, సీటీ స్కాన్, యాంజియోగ్రఫీ వంటి టెక్నిక్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
జార్ఖండ్‌లో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం రన్నింగ్ టెస్ట్ జరిగింది. ఇందులో పాల్గొన్న చాలా మంది యువకులు రేసులో మరణించారు. పరిగెత్తుతుండగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఇలాంటి కేసులు గత కొన్నేళ్లుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఇందుకు సంబంధించిన కొత్త కొత్త కేసులు వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. పార్టీలో డ్యాన్స్ చేస్తూ కొందరు, జిమ్ చేస్తూ కొందరు గుండెపోటుకు గురవుతున్నారు. ఆడుతూ, పాడుతూ మరణిస్తున్న కేసులన్నీ యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సంఘటనలు నేటి జనరేషన్ కు ఒక హెచ్చరిక. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29 న జరుపుకుంటున్నారు. ఈ రోజుని గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఎంపిక చేశారు. యువత గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం గుండె ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదాలను గుర్తించేందుకు ఈసీజీ, సీటీ స్కాన్, యాంజియోగ్రఫీ వంటి టెక్నిక్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉంది.
గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..?
యువతరంలో మానసిక ఒత్తిడి, చెడు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు, గుండె ఆగిపోవడం, గుండె నొప్పి వంటి కేసులు గణనీయంగా పెరగడానికి ఇవే కారణాలు. అందువల్ల ఏ వయస్సులో ఉన్న వారైనా సరే గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడం ప్రస్తుతం చాలా ముఖ్యం.
నిపుణులు ఏమని చెబుతున్నారంటే..?
గుండె సంబంధిత వ్యాధులను సమయానికి ముందే గుర్తించేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఢిల్లీలోని ధర్మశిల నారాయణ హాస్పిటల్ కార్డియాలజీ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ చెప్పారు. దీనిలో CT స్కాన్, యాంజియోగ్రఫీ అనేది ఇన్వాసివ్ ఇమేజింగ్ టెక్నిక్, ఇది ఎక్స్-రే సాంకేతికతను ఉపయోగించి కొరోనరీ ధమనుల వివరణాత్మక 3D ఇమేజింగ్‌ను అందిస్తుంది. ఇది సకాలంలో కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని గుర్తించడం సులభం చేస్తుంది.
గుండె జబ్బులను ఎలా నివారించాలంటే..?
నారాయణ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రచిత్ సక్సేనా మాట్లాడుతూ.. నేడు యువతలో అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు చాలా సాధారణం అయ్యాయి. అయితే చాలా మంది వీటిని పట్టించుకోవడం లేదు. శారీరకంగా తక్కువ శ్రమ చేస్తున్నారు. యువత తాము పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటారు. అందువల్ల యువత రెగ్యులర్ గా ఆరోగ్యం ఎలా ఉందో అని హెల్త్ చెకప్‌లు చేయించుకోరు. ఈ నిర్లక్ష్యం చాలా ప్రమాదకరరం. అనేక ప్రతికూలతలు ఉన్నాయి. నేటి జీవనశైలిని పరిశీలిస్తే.. ప్రతి ఒక్కరూ 30 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు కార్డియాక్ సర్జన్ డాక్టర్ రచిత్ సక్సేనా.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..