Edible Oil Prices: పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు

పండుగ సీజన్‌కు ముందు ఎడిబుల్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం ప్రజల వంటగది బడ్జెట్‌ను మరింతగా పెంచేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత నెలలో ఆవనూనె ధరలు 9.10 శాతం, పామాయిల్ ధరలు 14.16 శాతం పెరిగాయి. అదే సమయంలో ఆవనూనె ధరలు రిటైల్ మార్కెట్‌లో, ఆన్‌లైన్ కిరాణా కంపెనీల..

Edible Oil Prices: పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
Oil Price
Follow us

|

Updated on: Sep 28, 2024 | 4:40 PM

పండుగ సీజన్‌కు ముందు ఎడిబుల్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం ప్రజల వంటగది బడ్జెట్‌ను మరింతగా పెంచేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత నెలలో ఆవనూనె ధరలు 9.10 శాతం, పామాయిల్ ధరలు 14.16 శాతం పెరిగాయి. అదే సమయంలో ఆవనూనె ధరలు రిటైల్ మార్కెట్‌లో, ఆన్‌లైన్ కిరాణా కంపెనీల పోర్టల్‌లలో 26 శాతం పెరిగాయి.

ఆన్‌లైన్ స్టోర్లలో ధరలు 26 శాతం పెంపు:

నెల రోజుల క్రితం ఆన్‌లైన్ కిరాణా పోర్టల్‌లో కిలో ఆవనూనె రూ.139కి లభించగా, దీని ధర కిలో రూ.176కి చేరుకుంది. అంటే గత నెలలో ధరలు 26.61 శాతం పెరిగాయి. మస్టర్డ్ ఆయిల్‌ను దేశంలో ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్‌గా ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ లెక్కలు కూడా ఎడిబుల్ ఆయిల్ ధరల పెరుగుదలను ధృవీకరిస్తున్నాయి. వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల పర్యవేక్షణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. నెల క్రితం ఆగస్టు 25, 2024న కిలో రూ.139.19కి లభించిన ఆవాల నూనె ఇప్పుడు రూ.151.85కి అందుబాటులో ఉంది. ఆవనూనె ముంబయిలో కిలో రూ.183, ఢిల్లీలో రూ.165, కోల్‌కతాలో రూ.181, చెన్నైలో రూ.167, రాంచీలో కిలో రూ.163కి లభిస్తోంది.

ఇది కూడా చదవండి: Indian Railways: మీరు ఎక్కే రైలు మిస్‌ అయితే మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? నిబంధనలేంటి?

ఆవనూనెతో పాటు ఇతర వంటనూనెల ధరలు కూడా పెరిగాయి. నెల రోజుల క్రితం సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో రూ.119.38 ఉండగా, ప్రస్తుతం కిలో రూ.129.88కి లభిస్తోంది. నెల క్రితం కిలో రూ.98.28కి లభించే పామాయిల్ ఇప్పుడు కిలో రూ.112.2కి లభిస్తోంది. సోయా ఆయిల్ ధరలు కూడా నెలలో కిలో రూ.117.45 నుంచి రూ.127.62కి పెరిగాయి. కూరగాయల ధర కిలో రూ.122.04 నుంచి రూ.129.04కి పెరిగింది.

ధర ఎందుకు పెరుగుతోంది?

ఎడిబుల్‌ ఆయిల్‌ల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లనే ఎడిబుల్‌ ఆయిల్‌ల దిగుమతులు ఖరీదయ్యాయని తెలుస్తోంది. ముడి సోయాబీన్‌ ఆయిల్‌, క్రూడ్‌ పామాయిల్‌, క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని జీరో నుంచి 20 శాతానికి, ఎడిబుల్‌ ఆయిల్స్‌పై 12.5 శాతం నుంచి 32.5 శాతానికి ప్రభుత్వం పెంచింది. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల పామాయిల్, సోయా, ఆవాల నూనెలు అన్ని రకాల ఎడిబుల్ ఆయిల్స్ ఖరీదయ్యాయి. దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పెంచింది. అయితే దీని ప్రభావం ఎడిబుల్ ఆయిల్ వాడే వారి జేబులపై భారీగానే ఉండనుంది.

ఇది కూడా చదవండి: Rule Change 1st October: అక్టోబర్‌ 1 నుంచి ఐదు పెద్ద మార్పులు.. మీ జేబుపై ప్రభావం పడనుందా?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి