AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: మీ వంట గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!

గ్యాస్‌ సిలిండర్‌ అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వంట గ్యాస్‌ సిలిండర్‌ ఉండాలని, కట్టెల పొయ్యిపై వండకూడదనే ఉద్దేశంతో ఉజ్వల స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం దేశంలో అందరి ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్‌లే ఉన్నాయి. అయితే గ్యాస్‌..

Gas Cylinder: మీ వంట గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
Subhash Goud
|

Updated on: Sep 27, 2024 | 2:45 PM

Share

గ్యాస్‌ సిలిండర్‌ అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వంట గ్యాస్‌ సిలిండర్‌ ఉండాలని, కట్టెల పొయ్యిపై వండకూడదనే ఉద్దేశంతో ఉజ్వల స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం దేశంలో అందరి ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్‌లే ఉన్నాయి. అయితే గ్యాస్‌ సిలిండర్‌ను ఇష్టానుసారంగా వాడితే గ్యాస్‌ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే గ్యాస్‌ను ఎక్కువ రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం.

  1. బర్నర్‌: చాలా మంది వంట చేసేటప్పుడు బర్నర్‌ను మొత్తం పైకి తిప్పే అలవాటు ఉంటుంది. దీని వల్ల మీ ఎల్పీజీ గ్యాస్ త్వ‌ర‌గా అయిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే మీరు ఏదైనా వేడి చేయాల‌నుకున్నా, వంట చేయాల‌నుకున్నా పాత్ర కింది భాగంలో మంట ఉండేలా బ‌ర్న‌ర్ ను తిప్పుకుంటే స‌రిపోతుంది. దీని వ‌ల్ల ఎల్పీజీ సిలిండ‌ర్ ఎక్కువ రోజులు రావడంతో పాటు మీ వంట‌గ‌దిలో మ‌రింత వేడి లేకుండా ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.
  2. స్టవ్‌ బర్నర్‌ శుభ్రం ఉంచుకోవడం: అలాగే మీ స్టవ్ బర్నర్‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా ముఖ్యమే. ఎప్పటికప్పుడు బర్నర్‌ను శుభ్రం ఉంచుకోవడం వల్ల కూడా గ్యాస్‌ ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంది. ఇందు కోసం మీ గ్యాస్‌ మంట రంగును గమనిస్తే తెలిసిపోతుంది. గ్యాస్‌ మంట నీలం రంగు వచ్చినట్లయితే మీ బ‌ర్న‌ర్ స‌రిగ్గా ఉంద‌ని అర్థం. అలా కాకుండా ఎరుపు/పసుపు/నారింజ రంగు మంట వ‌స్తే మీ బ‌ర్న‌ర్ శుభ్రంగా లేద‌ని అర్థం చేసుకోవాలి.
  3. గ్యాస్ రంగు: అంటే గ్యాస్ పూర్తిగా ఉపయోగించడం వల్ల మంట అలా నీలం రంగు కాకుండా వ‌స్తుంది. గోరువెచ్చని నీరు, స్క్రబ్ బ్రష్ ఉపయోగించి బర్నర్‌ను శుభ్రం చేసుకోవాలి. అయినా కూడా అలాగే ఉంటే రిపేరు చేయించడం మంచిది.
  4. పాత్రలు తడిగా ఉంచడం: వంట చేసే ముందు వంట పాత్రలు బర్నర్‌పై ఉంచేటప్పుడు ఆ పాత్రలు పొడిగా ఉండాలి. తడిగా ఉంటే ఆవిరి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీని వల్ల కొంత గ్యాస్‌ వెస్ట్‌ అవుతుంది. చిన్ననీటి బిందువులను కలిగి ఉన్న పాత్రలు నీటిని ఆవిరి చేయడానికి ఎక్కువ గ్యాస్ వినియోగించాల్సి వ‌స్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. పాన్ వేడెక్కిన తర్వాత, మీరు మంటను తగ్గించి కూడా గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. అధిక మంట పెట్టడం వల్ల కూడా గ్యాస్‌ ఎక్కువా తీసుకుంటుంది.
  7. ప్రెషర్ కుక్కర్‌: ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగించండం వ‌ల్ల కూడా గ్యాస్ ను ఆదా చేయ‌వ‌చ్చు. ఓపెన్-పాస్‌ల వంటతో పోలిస్తే ఒత్తిడితో కూడిన ఆవిరి ఆహారాన్ని వేగంగా వండుతుంది. దీని వల్ల కూడా గ్యాస్‌ ఆదా అవుతుంది.
  8. గ్యాస్‌ లీక్‌: సాధారణంగా కొన్ని సిలిండర్‌లో అప్పుడప్పుడు సిన్నగా గ్యాస్‌ లీక్‌ అవుతుంటుంది. గ్యాస్‌ రెగ్యులేటర్‌, పైపు, బర్నర్‌ను చెక్‌ చేసుకోవాలి. మీ స్టవ్‌లో గ్యాస్ లైన్ దెబ్బ‌తిని వుంటే వంట చేయనప్పుడు కూడా గ్యాస్ వృధా అవుతుంది. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది.
  9. నానబెట్టడం: వండడానికి ముందు బియ్యం, పప్పులు నానబెట్టాలి. అలా నానబెట్టి వండితే అన్నీ చాలా త్వరగా ఉడుకుతాయి. దీంతో సిలిండర్‌ను ఆదా అవుతుంది.
  10. ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలు: మనకు ఉన్న పెద్ద అలవాటు ఏంటంటే ప్రతిదాన్ని ఫ్రిజ్‌లో పెడుతుంటాము. ఉదా: పాలు వంట చేసేటప్పుడు ఇలా వంటకు కావాల్సిన వస్తువులు ఫ్రిజ్ లో ఉంటే ముందుగా బయటకు తీయాలి. ఎందుకంటే అది కూలింగ్‌ తగ్గిపోయే వరకు సమయం పడుతుంది. అంటే వేడెక్కడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఇది గ్యాస్ అయిపోవడానికి ఓ కారణమే.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి