Gold Rate Journey: రూ.10 వేల నుంచి రూ.60 వేలకు బంగారం ధర ప్రస్థానం సాగింది ఇలా..

మార్చి 20వ తేదీన 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.60 వేలు దాటింది. కేవలం 3 సంవత్సరాల 3 నెలల్లో బంగారం ధర 50 శాతం పెరిగింది. అంటే రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు 39 నెలల్లో పెరిగింది. కాగా రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ప్రయాణం కేవలం 7 నెలల్లోనే పూర్తయింది. 2008 ప్రపంచ సంక్షోభానికి ముందు అంటే 2006లో బంగారం ధర కేవలం రూ.10 వేలు.

Gold Rate Journey: రూ.10 వేల నుంచి రూ.60 వేలకు బంగారం ధర ప్రస్థానం సాగింది ఇలా..
Gold price journey
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 25, 2023 | 7:31 PM

బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. అది కరోనా పాండమిక్‌లో అయినా లేదా 2008 సంక్షోభం అయినా కష్ట సమయాల్లో చాలా మందికి బంగారం అక్కరకు వచ్చింది. గత కొంతకాలంగా అమెరికా, చైనా వంటి దేశాల్లో ఆర్థిక మాంధ్యం పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపారు. ఎలాంటి పరిస్థితిల్లో అయినా బంగారం నిజంగా కష్టాలకు తోడుగా నిలుస్తుందని ఎన్నో సంక్షోభ సమయాల్లో నిర్ధారణ అయ్యింది.

మార్చి 20వ తేదీన 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.60 వేలు దాటింది. కేవలం 3 సంవత్సరాల 3 నెలల్లో బంగారం ధర 50 శాతం పెరిగింది. అంటే రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు 39 నెలల్లో పెరిగింది. కాగా రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ప్రయాణం కేవలం 7 నెలల్లోనే పూర్తయింది. 2008 ప్రపంచ సంక్షోభానికి ముందు అంటే 2006లో బంగారం ధర కేవలం రూ.10 వేలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగారం ప్రయాణం అసాధారణంగా సాగింది. రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు బంగారం ఎలా ప్రయాణించిందో కూడా చెప్పుకుందాం.

నాలుగున్నరేళ్లలో రూ.10 వేల నుంచి రూ.20 వేలకు.. మే 5, 2006న భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ.10,000గా ఉంది. ఆ తర్వాత బంగారం రూ.20 వేల మైలురాయిని దాటేందుకు నాలుగున్నరేళ్లు పట్టింది. 6 నవంబర్ 2010న బంగారం ధర 20 వేల స్థాయిని తాకింది.

ఇవి కూడా చదవండి

19 మాసాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేలకు.. రూ.20 నుంచి 30 వేలకు బంగారం ధర చేరుకునేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. కేవలం 19 నెలల్లోనే పసిడి ధర రూ. 20 వేల నుండి 30 వేల రూపాయలకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపారు. దీంతో బంగారం ధర భారీగా పెరిగింది. జూన్ 1, 2012న బంగారం ధర తొలిసారిగా రూ.30 వేలకు చేరింది.

ఏడున్నరేళ్ల నిరీక్షణ.. ఆ తర్వాత పసిడి ధరలు రూ.30 వేల నుంచి రూ.40వేలకు చేరుకునేందుకు సుదీర్ఘ నిరీక్షణ నెలకొంది. దీనికి ఏడున్నర సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించలేదు. ఫలితంగా బంగారం ధర రూ.30 వేల నుంచి రూ. 40 వేలకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. జనవరి 3, 2020న బంగారం ధర మొదటిసారిగా రూ. 40 వేల మైలురాయిని చేరింది. అప్పుడే చైనా, అమెరికా, భారత్‌‌లో కరోనా ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత మార్చి 2020 నాటికి బంగారం ధర పడిపోయింది.

7 నెలల్లో బంగారం ధర రూ.40 వేల నుంచి 50 వేలకు.. కోవిడ్ సంక్షోభం ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం కారణంగా 2020 సంవత్సరంలో బంగారం ధర చాలా వేగంగా పెరిగింది. కేవలం 7 నెలల్లోనే బంగారం ధర రూ.40 వేల నుంచి రూ.50 వేలకు చేరింది. జూలై 22న పసిడి ధర మొదటిసారిగా రూ. 50 వేలకు చేరుకుంది. ఆగస్టు 8, 2020న బంగారం తన జీవితకాల గరిష్ట స్థాయి రూ.56,191కి చేరుకుంది.

32 నెలల్లో బంగారం రూ.60 వేల స్థాయికి.. 2020 సంవత్సరం తర్వాత బంగారం ధర మరో పది వేల రూపాయలు పెరగడానికి 32 నెలలు పట్టింది. మార్చి 20వ తేదీన బంగారం ధర 60 వేలు దాటింది. అదే సంవత్సరంలో బంగారం జీవిత కాల గరిష్ఠ స్థాయి రూ.60,455కి చేరింది. బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మార్చి 8 నుంచి బంగారం ధర 10 శాతం పెరిగింది.

మే నెలలో గరిష్ఠ రికార్డు స్థాయికి.. ఆ తర్వాత బుల్లియన్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో గత ఆరు మాసాలుగా బంగారం ధరల్లో ఊగిసలాట కొనసాగుతోంది. 10 గ్రాముల పసిడి రూ.60 వేలకు అటు.. ఇటుగా ఊగిసలాడుతోంది. మే 4న పసిడి ధరలు రికార్డు గరిష్ఠ స్థాయిలో రూ.62,400కు చేరుకున్నా.. ఆ తర్వాత ధరలు క్షీణించాయి. సెప్టెంబర్ 25న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,950గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..