పిల్లల కోసం లక్షలు ఇస్తుంది.. టాక్స్ ఫ్రీ కూడా.. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అదుర్స్..

పిల్లల భవిష్యత్ కోసమే చాలావరకూ అందరూ కష్టపడతారు. పిల్లల కోసం ఫండ్స్ పోగేసి.. వారికి అందించాలని అనుకుంటారు. అందుకోసం రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తువస్తారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ పిల్లల అవసరాల కోసం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉంటారు. మనకి అందుబాటులో ఎన్నో రకాలైన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.

పిల్లల కోసం లక్షలు ఇస్తుంది.. టాక్స్ ఫ్రీ కూడా.. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అదుర్స్..
Ppf Scheme
Follow us
KVD Varma

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2023 | 2:00 PM

పిల్లల భవిష్యత్ కోసమే చాలావరకూ అందరూ కష్టపడతారు. పిల్లల కోసం ఫండ్స్ పోగేసి.. వారికి అందించాలని అనుకుంటారు. అందుకోసం రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తువస్తారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ పిల్లల అవసరాల కోసం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉంటారు. మనకి అందుబాటులో ఎన్నో రకాలైన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వేటికవి ప్రత్యేక లక్షణాలతో.. ఇంట్రస్ట్ ఆఫర్లతో ఉంటాయి. మీరు కనుక పిల్లల కోసం మంచి ఫండ్ ఇవ్వాలి.. దానితో పాటు టాక్స్ కూడా సేవ్ చేసుకోవాలి అని భావిస్తుంటే.. దానికి సరిగ్గా సరిపోయే ఆప్షన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం అని చెప్పవచ్చు. దాని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ స్కీమ్ పై ఏడాదికి 7.1% వడ్డీ ఇస్తున్నారు. పిల్లల పేరు మీద ఈ PPF ఎకౌంట్ ఓపెన్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి ఫండ్ వారికి ఏర్పాటు చేయవచ్చు. ఇలా చెప్పిన వెంటనే మీకు ఒక అనుమానం వచ్చి ఉంటుంది. PPF పెద్దవారికి మాత్రమే కదా.. పిలలకు ఈ ఎకౌంట్ ఓపెన్ చేయవచ్చా? అని. అవునా.. చాలామంది ఇలానే అనుకుంటారు. అయితే, PPF ఎకౌంట్ కొన్ని నిబంధనలను అనుసరించి పిల్లలకూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ రూల్స్ ఏమిటో వివరంగా చూద్దాం.

ఎవరైనా ఒక వ్యక్తి ఒక్క PPF ఎకౌంట్ మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు. కానీ, ఒక మైనర్ పిల్లల పేరుమీద కూడా ఎకౌంట్ ఓపెన్ చేసుకునే వేసులుబాటూ PPFలో ఉంది. ఇది చాలామందికి తెలీదు. అయితే ఒక్కరి పేరు మీద మాత్రమే మైనర్ ఎకౌంట్ ఓపెన్ చేయగలరు. అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి పేరుపై మాత్రమే PPF ఎకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉంటే మైనర్ పిల్లల PPF ఎకౌంట్ ను మరొకరి తల్లి, తండ్రి గార్డియన్స్ గా తెరవవచ్చు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే పిల్లల పేరిట మైనర్ PPF ఎకౌంట్ తెరవలేరు.

మైనర్ పిల్లలు 18 ఏళ్లు నిండాకా ఆ ఎకౌంట్ ను మేజర్ గా మార్చుకోవచ్చు. దీని కోసం అతను అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి పిల్లవాడు తన ఎకౌంట్ తానే ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి.. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో అంటే పిల్లల హై ఎడ్యుకేషన్ లేదా ఏదైనా వ్యాధి బారిన పడితే దాని చికిత్స కోసం.. 18 సంవత్సరాలు నిండిన తరువాత మైనర్ ఎకౌంట్ క్లోజ్ చేయవచ్చు. PPF ఎకౌంట్ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ తరువాత మొత్తం అంతా విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ డబ్బు అవసరం లేదు అనుకుని.. PPF ఎకౌంట్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మరో 5 ఏళ్లు దానిని పొడిగించుకునే అవకాశం ఉంది.

టాక్స్ మినహాయింపు ఇలా..

PPF అనేది EEE కేటగిరీలోకి వస్తుంది. అందువల్ల ఇందులో చేసే సేవింగ్స్ అన్నీ పన్ను రహితంగా ఉంటాయి. అంతేకాదు దీనిపై వచ్చే వడ్డీపై కూడా ఎటువంటి టాక్స్ ఉండదు. PPF లో మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు మారుతుంది.

ఎంత పెట్టవచ్చు?

PPF ఎకౌంట్ లో గరిష్టంగా సంవత్సరానికి 1.5 లక్షల వరకూ పెట్టవచ్చు. తల్లిదండ్రులకు సొంత PPF ఎకౌంట్ ఉంటే, వారి స్వంత ఎకౌంట్ అలాగే మైనర్ పిపిఎఫ్ PPF ఎకౌంట్ తో సహా సంవత్సరానికి గరిష్ట డిపాజిట్ పరిమితి రూ .5.1 లక్షలు.