వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించండి ఇలా.. ఇదొక్కటి ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ లైఫ్ అదిరిపోతుంది..
మనలో చాలా మంది రిటైర్మెంట్ జీవితం గురించి చాలా ఆందోళన పాడుతారు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా రిటైర్ కావాలనుకుంటారు. ప్రస్తుత పరిస్థితిలో అందరూ రిటైర్ అయిన తారువాత ఎవరి మీదా ఆధారపడకుండా జీవించాలని కోరుకుంటారు. మంచి ప్రదేశంలో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు.
మనలో చాలా మంది రిటైర్మెంట్ జీవితం గురించి చాలా ఆందోళన పాడుతారు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా రిటైర్ కావాలనుకుంటారు. ప్రస్తుత పరిస్థితిలో అందరూ రిటైర్ అయిన తారువాత ఎవరి మీదా ఆధారపడకుండా జీవించాలని కోరుకుంటారు. మంచి ప్రదేశంలో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. అంతేకదా. మరి ఇది సాధ్యం అయ్యే పనేనా? ఈ ప్రశ్నకు కూడా ఇలా కలలు కనేవారిలో చాలామంది కష్టం అనే సమాధానం చెబుతారు. కానీ.. జీవితపు చరమాంకంలో జీవితాన్ని తమకు నచ్చినట్టు గడపాలని కోరుకునే వారికి ఒక మంచి అవకాశం ఉంది. అది ఏమిటో తెలుసుకునే ముందు ఈ లెక్కలు ఒకసారి చూడండి.
సీనియర్ సిటిజన్స్.. అంటే 60 ఏళ్లు దాటినవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 2001 జన గణన ప్రకారం దేశంలో దాదాపు 76 మిలియన్ల సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ఇది 2011 లెక్కల సమయానికి 104 మిలియన్లకు చేరింది. ఇక ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అంచనా ప్రకారం వీరి సంఖ్య 2025 నాటికి 173 మిలియన్లకు చేరుకుంటుంది. ఇక 2050కి 240 మిలియన్ల సీనియర్ సిటిజన్స్ మన దేశంలో ఉంటారు. ఈ అంచనా ప్రకారం 2015లో 8 శాతం ఉన్న సీనియర్ సిటిజన్ల వాటా 2050 నాటికి 19 శాతానికి చేరుతుంది. మన దేశంలో ఇలా పెరుగుతున్న వృద్ధుల సంఖ్య దృష్టిలో పెట్టుకుని సీనియర్ లివింగ్ హోమ్‌లు లేదా రిటైర్‌మెంట్ హోమ్‌లను తీసుకువచ్చారు. 2000 తర్వాత రిటైర్‌మెంట్ హోమ్‌ల మార్కెట్ పరిమాణం వేగం పుంజుకుంది. మార్కెట్ పరిశోధన, అడ్వైజరీ సంస్థ మోర్డోర్ ఇంటెలిజెన్స్ అధ్యయనం ప్రకారం.. ఈ 2023లో సీనియర్ లివింగ్ హోమ్‌ల మార్కెట్ విస్తరణ సుమారు 10 బిలియన్ డాలర్లు. ఇది 2028 వరకు దాదాపు 10 శాతం వార్షిక రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా.
మామూలు ప్రజల కోసం నిర్మించే ఇల్లు నగరం మధ్యలో ఉంటాయి. కానీ ఈ సీనియర్ లివింగ్ హోమ్ లు మాత్రం కాలుష్యం.. ట్రాఫిక్ రణగొనికి దూరంగా నగర శివర్లలోనిర్మిస్తున్నారు. ఇవి 55 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తుల కోసం సిద్ధం చేశారు. అయితే, వీటిలో కొన్ని 50 ఏళ్ల వారికీ ఉంటాయి. ఇవి కూడా కొనుక్కోవచ్చు. నిజానికి ఈ ఇళ్లు ఈ వయసు వారైనా కొనుక్కోవచ్చు కానీ.. 55 ఏళ్లు దాతకా మాత్రమే ఆ ఇంటిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇవి వృద్ధాశ్రమాలు అని పొరపడవద్దు. ఇక్కడ ఫుడ్ హౌస్ కీపింగ్, ఆరోగ్య సంరక్షణ, భద్రత ఉంటాయి.వీటిలో డైనింగ్, మెయిడ్, క్లీనింగ్ సర్వీస్, ఇంటీరియర్, కామన్ ఏరియాలో నాన్-స్లిప్ టైల్స్, హోల్డింగ్ బార్‌లు, ర్యాంప్‌లు, కిరాణా దుకాణం, దేవాలయాలు, టెర్రస్ గార్డెన్‌లు మొదలైన సౌకర్యాలు ఉంటాయి.
మెడికల్, వెల్నెస్, యాక్టివిటీ సర్వీసుల విషయానికి వస్తే.. అంబులెన్స్, ప్రాథమిక క్లినిక్ సౌకర్యాలు, యోగా, మెడిటేషన్ సెంటర్, సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ హెల్త్ క్లబ్ లేదా జిమ్, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ సర్వీస్, థియేటర్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. పెరుగుతున్న నేరాల రేటును పరిగణనలోకి తీసుకుంటే 24 గంటల భద్రత, CCTV పర్యవేక్షణ ఉంది. ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, పూణే, సమీపంలోని హిల్ స్టేషన్ లావాసా, జైపూర్, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్‌తో సహా అన్ని మెట్రో నగరాల్లో ఈ సీనియర్ లివింగ్ హోమ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. డెహ్రాడూన్, రిషికేశ్, భువనేశ్వర్, అహ్మదాబాద్, భోపాల్, వడోదరలో కూడా సీనియర్ లివింగ్ హోమ్‌లు నిర్మించారు.
సాధారణంగా సీనియర్ లివింగ్ హోమ్‌ల ధర 40 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల మధ్య ఉంటుంది. లగ్జరీ రిటైర్‌మెంట్ హోమ్‌లు చాలా తక్కువగా ఉంటాయి. వీటి ధరలు 2.5 కోట్ల రూపాయల నుంచి మొదలై 10 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. ఇంటి ధర ప్రాజెక్ట్ ప్రదేశం అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది. మీరు రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా ఉండాలని భావిస్తే ఇటువంటి ఇల్లు ఒకటి సిద్ధం చేసుకోవచ్చు. మీ రిటైర్మెంట్ ప్లాన్ లో దీనిని కూడా చేర్చుకుంటే వృద్ధాప్యంలో జీవితం హాయిగా.. పిలల్లపై ఆధారపడకుండా సాగిపోతుంది.