PM Kisan: రైతన్నల సమస్యలకు టెక్నాలజీతో చెక్.. పీఎం కిసాన్‌ కోసం అందుబాటులోకి AI చాట్‌బాట్‌

ఈ పథకాన్ని రైతులకు మరింత సులభంగా చేరువయ్యేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ సహాయం తీసుకుంటోంది. పీఎమ్‌ కిసాన్‌ పథకం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ చాట్‌బాట్‌ ఇంగ్లిష్‌, హిందీ, బెంగాలీ, ఒరియాతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉంది. త్వరలోనే దేశంలోని మొత్తం 22 అధికారిక భాషల్లో సేవలను...

PM Kisan: రైతన్నల సమస్యలకు టెక్నాలజీతో చెక్.. పీఎం కిసాన్‌ కోసం అందుబాటులోకి AI చాట్‌బాట్‌
Pm Kisan AI
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 25, 2023 | 3:31 PM

దేశంలోని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రైతుల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా రైతులకు మూడు వాయిదాల్లో ఏటా రూ. 6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా సుమారు 11 కోట్ల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. సుమారు రూ. 2.61 లక్షల కోట్లను రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ (DBT) పథకాల్లో పీఎం కిసాన్‌ ఒకటిగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ పథకాన్ని రైతులకు మరింత సులభంగా చేరువయ్యేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ సహాయం తీసుకుంటోంది. పీఎమ్‌ కిసాన్‌ పథకం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ చాట్‌బాట్‌ ఇంగ్లిష్‌, హిందీ, బెంగాలీ, ఒరియాతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉంది. త్వరలోనే దేశంలోని మొత్తం 22 అధికారిక భాషల్లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానించడానికి భారత ప్రభుత్వ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి ఈ ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించారు.

ఈ ఏఐ చాట్‌బాట్‌ను పీఎం కిసాన్‌ మొబైల్ యాప్‌ ద్వారా ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఫ్లాష్‌షిప్‌ పథకంలో అటాచ్‌ చేసిన మొదటి ఏఐ చాట్‌బాట్ ఇదే కావడం విశేషం. ఈ చాట్‌బాట్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి సలహాలను నిత్యం నివృత్తి చేస్తుంది. పథకానికి సంబంధించిన సమాచారం పొందడం, ఫిర్యాదులను పరిష్కరించడంలో రైతులు ఎదుర్కొంటు్న సమస్యలను అధిగమించడానికి ఈ ఏఐ చాట్ బాట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Pm Kisan

ఈ చాట్‌బాట్‌ ద్వారా  రైతుల అప్లికేషన్‌ స్టేటస్‌, చెల్లింపుల వివరాలు, పథకానికి సంబంధించిన అప్‌డేట్స్‌, వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తుందని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఫేస్‌ అథెంటికేషన్‌ ఆధారిత ఈ-కేవైసీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా రైతులు నేరుగా తమ ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. దేశంలోని మారుమూల ప్రాంతంనుంచైనా ఎలాంటి ఓటీపీ, ఫింగర్‌ ప్రింట్ అవసరం లేకుండా కేవలం ఫేస్‌ స్కాన్ చేయడం ద్వారా ఈ-కేవైసీని పూర్తి చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..