రీ-సేల్ ప్రాపర్టీ బెస్ట్ డీల్ కావచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. కచ్చితంగా తెలుసుకోండి..

చిన్నదైనా సరే సొంతిల్లు ఉంటే తినో.. తినకో జీవితం గడిచిపోతుంది. ఇల్లు లేకపోతే నెల నెలా అద్దె కట్టడానికి సంపాదనలో సగం ఖర్చు అయిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందుకే మన దేశంలో చాలామంది మొదటి అతి పెద్ద కల సొంతిల్లు. ఈ కల నెరవేర్చుకోవడం కోసం చాలా శ్రామిస్తారు ప్రజలు.

రీ-సేల్ ప్రాపర్టీ బెస్ట్ డీల్ కావచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. కచ్చితంగా తెలుసుకోండి..
Re Sale Property
Follow us
KVD Varma

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2023 | 2:00 PM

చిన్నదైనా సరే సొంతిల్లు ఉంటే తినో.. తినకో జీవితం గడిచిపోతుంది. ఇల్లు లేకపోతే నెల నెలా అద్దె కట్టడానికి సంపాదనలో సగం ఖర్చు అయిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అందుకే మన దేశంలో చాలామంది మొదటి అతి పెద్ద కల సొంతిల్లు. ఈ కల నెరవేర్చుకోవడం కోసం చాలా శ్రామిస్తారు ప్రజలు. కరోనా తరువాత సొంతిల్లు అనే భావన మరింత ఎక్కువగా మారిపోయింది. అందుకే కరోనా తరువాతి కాలంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పరుగులు తీస్తోంది. ఎంత ఎక్కువ ఇళ్లు నిర్మాణ రంగంలో అందుబాటులోకి వస్తున్నాయో అంతకంటే ఎక్కువ డిమాండ్ ఇళ్ల కోసం ఉంది. ఇది అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.

మరి ఒక మధ్యతరగతి వ్యక్తికి కొత్త ఇల్లు కొనుక్కోవడం సాధ్యం అయ్యే పనేనా? పెరుగుతున్న ధరలతో తాము చేసిన సేవింగ్స్.. తమ లోన్ ఎలిజిబిలిటీ అన్నిటినీ చూసుకుంటే కొత్త ఇల్లు సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించదు. కొత్త ఇల్లు కొనుక్కోవడంలో ఉండే కొన్ని ప్రధాన సమస్యలు ఏమిటంటే.. మనం కోరుకున్న లొకేషన్ లో ఇల్లు దొరకడం కష్టం కావచ్చు. ఒకవేళ దొరికినా అది మన బడ్జెట్ కి మించినది అయి ఉండవచ్చు. మనకు కావలసిన లొకేషన్ లో మనకు కావలసిన విధంగా ప్రాపర్టీ కొత్తది మనకు అందుబాటులో దొరకడం ఎప్పుడూ కష్టమే. చాలామంది ఈ విషయంలో తప్పక రాజీ పడి.. ఊరికి దూరంగా.. లేదా కాస్త వెనుకబడిన ప్రాంతంలో (తరువాత డెవలప్ అవుతుంది అని నమ్మి) ఇల్లు కొనుక్కోవడం చేస్తుంటారు. ఇలా రాజీ పడాల్సిన పనిలేదు. ఇటువంటి నేపధ్యంలో కొత్త ఇల్లు కంటే రీ సేల్ ప్రాపర్టీ కొనడం వైపు వెళ్ళవచ్చు.

రీ సేల్ ప్రాపర్టీ – సాధారణ మాటల్లో చెప్పాలంటే పాత ఆస్తి లేదా ఓల్డ్ ప్రాపర్టీ లేదా సెకండ్ హ్యాండ్ హోమ్ ఇలా చెప్పుకోవచ్చు. ఇంకాస్త వివరంగా చెప్పుకోవలంటే.. ఎవరయినా ఒక వ్యక్తి ప్రాపర్టీ బిల్డర్ దగ్గర కొని.. కొన్ని రోజుల తరువాత తన అవసరం కోసం ఆ ప్రాపర్టీని సేల్ కి పెట్టవచ్చు. ఇటువంటి ప్రాపర్టీనే రీ సేల్ ప్రాపర్టీగా చెబుతారు. రీ సేల్ ప్రాపర్టీలో ఉండే సౌలభ్యం ఏమిటంటే ఇల్లు కొనుక్కున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు. కావలసిన ప్రదేశంలో ఇల్లు దొరుకుతుంది. అయితే మంచి లొకేషన్ లో రీ సేల్ ప్రాపర్టీల ధారలూ ఇప్పుడు ఎక్కువగానే ఉన్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రీ సేల్ ప్రాపర్టీ ధరలు సగటున 7% నమోదు అయ్యాయని PropTiger.com రిపోర్ట్ చెబుతోంది. 2021తో పోలిస్తే, 2022లో చదరపు అడుగుకు రూ. 6,700-6,900 ధర పెరిగిందని ఆ రిపోర్ట్ పేర్కొంది.

కొత్త ఇల్లు కొనుక్కునే సమయంలో వచ్చే ఇబ్బందులు రీ సేల్ ప్రాపర్టీ కొనేటప్పుడూ వస్తాయి. మరి రీ సేల్ ప్రాపర్టీ కొనాలని అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయంపై నిపుణులు ఏమి చెప్పారు తెలుసుకుందాం.

మొదటగా రీ సేల్ ప్రాపర్టీ ఏజ్ చూడాలి. ఇందుకు స్ట్రక్చరల్ ఇంజనీర్ సహాయం తీసుకోవాలి. ఇంటికి ఎంత బలం ఉంది అనే విషయాన్ని ఆయన కచ్చితంగా లెక్క కడతారు. ఒకవేళ ఇంటికి బలం తగ్గిపోయి ఉంటే దానిని మళ్ళీ రెన్నోవేషన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇల్లు ఉన్న ప్రదేశం.. అక్కడ ఉన్న రీ సేల్ మార్కెట్ వాల్యూ, ఇంటి వయసు అన్నిటినీ పరిశీలించిన తారువాత అన్నీ సరిగ్గా కుదిరిన తరువాత చేయాల్సిన పని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం. ఇంటి యజమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, టైటిల్ డీడ్ ఇలా అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించండి. ఇంటి పై ఏదైనా లోన్ ఉందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా సొసైటీలో హౌస్ లేదా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుంటున్నట్లయితే.. ఆ సొసైటీ లేదా అసోసియేషన్ లో ఆ ఇంటి గురించి విచారించండి. మెయింట్ నెన్స్ ఛార్జీలు, ఎలక్ట్రిక్ ఛార్జీలు లేదా ఇతర రకాలైన ఏవైనా బకాయిలు ఉన్నాయేమో స్పష్టంగా తెలుసుకోండి. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా కచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాపర్టీనే ఎంచుకోండి. ఒక్కోసారి రిజిస్ట్రేషన్ లేని ప్రాపర్టీలు చాలా తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి. దానిలో చాలా రిస్క్ ఉంటుంది. డబ్బు తక్కువ కదా అని సరైన పేపర్స్ లేకుండా ప్రాపర్టీని ఎట్టి పరిస్థితిలోనూ కొనకండి.

చివరగా.. ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు అది పాతదైనా.. కొత్తదయినా.. అన్నీ విషయాలను జాగ్రత్తగా పరిశీలించి.. నమ్మకం కుదిరితేనే తీసుకోండి. అవసరం అయితే నిపుణుల సలహాలు తీసుకోండి. అలా అని బ్రోకర్ల మాట పట్టుకుని ముందుకు వెళ్ళకండి. ప్రతి విషయాన్ని స్వయంగా చెక్ చేసుకోవడం మంచింది.