Gold and Silver Price Today: పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు

Gold and Silver Price Today: బంగారం కొనుగోలుదారులకు ఇది షాకింగ్‌ న్యూసే. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు ఎగబాకుతోంది. గత నాలుగైదు..

Gold and Silver Price Today: పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు
Gold And Silver
Follow us
Subhash Goud

|

Updated on: Jul 08, 2021 | 6:23 AM

Gold and Silver Price Today: బంగారం కొనుగోలుదారులకు ఇది షాకింగ్‌ న్యూసే. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు ఎగబాకుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం తాజాగా గురువారం కూడా పెరిగింది. బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు బంగారు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. అయితే వెండి ధర విషయానికొస్తే బంగారం పెరిగితే వెండి మాత్రం తగ్గుముఖం పట్టింది. తాజాగా సిల్వర్‌ ధర తగ్గింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో గురువారం ఉదయం నాటికి నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,850 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,970 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

వెండి ధరలు

ఇక దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, కోల్‌కతాలో రూ.70,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, కేరళలో రూ.70,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉండగా, విజయవాడలో రూ.74,100 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లు తస్మాత్‌ జాగ్రత్త.. వారికి ఆ వివరాలు చెప్పవద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ..!

Toshiba Inverter AC: అమెజాన్‌లో రూ.96,700 విలువైన ఇన్వర్టర్‌ ఏసీ.. కేవలం రూ.5,900లకే.. లాభపడిన కస్టమర్లు