SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లు తస్మాత్‌ జాగ్రత్త.. వారికి ఆ వివరాలు చెప్పవద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ..!

SBI Customer Alert: దేశంలో సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తోంది. రోజురోజుకు..

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లు తస్మాత్‌ జాగ్రత్త.. వారికి ఆ వివరాలు చెప్పవద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ..!
Follow us

|

Updated on: Jul 05, 2021 | 11:33 AM

SBI Customer Alert: దేశంలో సైబర్‌ నేరాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తోంది. రోజురోజుకు ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాలు జరుగకుండా ఉండేందుకు బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు గణనీయంగా మెరుగుడినప్పటికీ, కొత్త రకంగా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు సైబర్‌ నేరగాళ్లు. అమాయకులను ఆసరా చేసుకుని అడ్డంగా మోసగిస్తున్నారు. ప్రజలు తమ మొబైల్‌ నుంచి వేర్వేరు యాప్‌ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు పొందుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు మరింతగా మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి అంటూ సైబర్‌ నేరగాళ్లు కస్టమర్లకు మెసేజ్‌లు, ఫోన్లు చేస్తూ వారి పూర్తి వివరాలు రాబట్టుకుంటున్నారు. ఈ తరుణంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా అనేక బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు డిజిటల్‌ మోసాలపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఎస్‌బీఐ మరోసారి తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. సైబర్‌ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తోంది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది.

ఖాతాదారులు మోగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఆన్‌లైన్‌లో ఎటువంటి సున్నితమైన వివరాలను ఎవ్వరితోను పంచుకోవద్దని హెచ్చరించింది. నెట్‌బ్యాంకింగ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, డేటాప్‌బర్త్‌ వివరాలు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ నేమ్‌ గానీ, పాస్‌వర్డ్‌, ఏటీఎం నెంబర్‌, బ్యాంకు అకౌంట్‌, ఏటీఎం కార్డు పిన్‌ నెంబర్‌, సీవీవీ, ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని, లేకపోతే నిలువునా మోసపోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అలాగే ఎవరైనా ఎస్‌బీఐ నుంచి ఫోన్‌లు చేస్తూ మీ బ్యాంకు వివరాలు, డెబిట్‌ కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవదని తెలిపింది.

చాలా మంది బ్యాంక్‌ లావాదేవీలు, బ్యాంకులకు సంబంధించి ఇతర పనులు ఎక్కువ మంది మొబైల్‌లో ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆసరా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి నిఘానే పెట్టారు.

అయితే ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరాలు చాలా పెరిగిపోతున్నాయి. ఎందరో కస్టమర్లు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షలు పోగొట్టుకున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయితే కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తూ వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. సైబర్‌ నేరగాళ్లు ఎస్‌బీఐ నుంచి అంటూ కస్టమర్లకు ఫోన్‌లు చేస్తూ నిలువు దోపిడి చేస్తున్నారు. మీ ఏటీఎం బ్లాక్‌ అయ్యిందని, అది అన్‌బ్లాక్‌ కావాలంటే ఓటీపీలు, లేదా ఖాతానెంబర్‌ ఇలా రకరకాలుగా అడుగుతూ కస్టమర్‌ ఖాతా నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారు. ఇలా చాలా మంది మోసపోయారు. లేకపోతే కస్టమర్ల ఫోన్‌ నెంబర్‌కు లింక్‌ పంపించి అది ఓపెన్‌ చేయగానే సదరు కస్టమర్‌ బ్యాంకు వివరాలు నేరగాళ్లుకు చేరిపోతాయి.

ఇవీ కూడా చదవండి

Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. పరుగులు పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!

PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు వేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం..!