Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. పరుగులు పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
Petrol Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ముందే కరోనాతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి..
Petrol Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. ముందే కరోనాతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక పలు రాష్ట్రాలో అయితే సెంచరీ దాటేసింది. దేశ రాజధానిలో పెట్రోల్ ధర వందకు చేరువలో ఉంది. ఇక తాజాగా పెట్రోల్, డీజిల్‌పై 31 నుంచి 39 పైసల వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
► దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 గా ఉండగా, డీజిల్ రూ. 89.40 వద్ద కొనసాగుతోంది. ► దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ రూ. 105.62 కాగా, డీజిల్ రూ. 96.95 గా నమోదైంది. ► చెన్నైలోలో లీటర్ పెట్రోల్ రూ. 100.78, డీజిల్ రూ. 93.94గా ఉంది. ►బెంగళూరులో పెట్రోల్ రూ. 103.84 , డీజిల్ రూ. 94.72 గా వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.78 వద్ద ఉండగా, డీజిల్ రూ. 97.40 గా నమోదైంది. ► విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.106.26కు చేరింది. ఇక డీజిల్ ధర రూ. 99.27 వద్ద కొనసాగుతోంది.
కాగా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఫునేలోని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 మార్క్ దాటింది. అయితే వ్యాట్, సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరలు మారుతుంటాయి. ఇక దేశంలోని పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ అత్యధిక వ్యాట్ వసూలు చేస్తోంది. దీని తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలున్నాయి.