AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక టోల్‌ ఛార్జ్‌ రూ.15లే.. ఆగస్ట్‌ 15 నుంచి అమలు!

FASTag Rules: ప్రతి ఒక్కరూ FASTag వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదా? ప్రతి ఒక్కరూ FASTag వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదు. అయితే, రోజువారీ ప్రయాణికులు చెల్లించే టోల్ ఛార్జీలను తగ్గించడం దీని లక్ష్యం. వార్షిక పాస్ కొనడానికి ఇష్టపడని వారికి, వారి ప్రస్తుత FASTag యథాతథంగా

FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక టోల్‌ ఛార్జ్‌ రూ.15లే.. ఆగస్ట్‌ 15 నుంచి అమలు!
Subhash Goud
|

Updated on: Aug 09, 2025 | 11:58 AM

Share

దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ 18న ఒక కీలక ప్రకటన చేశారు. వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు. ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం రూ. 15కే టోల్ ప్లాజాను దాటగలరని, ఇది ప్రస్తుత ఖర్చు కంటే చాలా తక్కువ అని గడ్కరీ అన్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. కొంపముంచిన మొండితనం.. ఇది కరెక్టేనా మీరు చెప్పండి

వార్షిక ఫాస్ట్‌ ట్యాగ్‌ పాస్‌ ధర రూ.3000

ఇవి కూడా చదవండి

వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ప్రయోజనాలను వివరిస్తూ నితిన్ గడ్కరీ ఈ పాస్ ధర రూ.3000గా నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చని చెప్పారు. ఇక్కడ ‘ఒక ప్రయాణం’ అంటే ఒక టోల్ ప్లాజాను దాటడం. ఈ లెక్క ప్రకారం.. రూ.3000కి 200 టోల్‌లను దాటడం అంటే టోల్‌కు కేవలం రూ.15 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు.

ఇది కూడా చదవండి: రాఖీ పండగకి భగ్గుమన్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తలం ధర ఎంతంటే..

సాధారణంగా, మీరు ఏదైనా టోల్ ప్లాజా గుండా ఒకసారి వెళ్ళడానికి సగటున రూ.50 చెల్లిస్తే, 200 టోల్ ప్లాజాలను దాటడానికి మీరు మొత్తం రూ.10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వార్షిక FASTag పాస్‌ని ఉపయోగించడం ద్వారా మీరు నేరుగా రూ.7000 వరకు ఆదా చేయవచ్చు.

వార్షిక పాస్ ప్రయోజనాలు:

కొత్త వార్షిక FASTag పాస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న FASTagను తరచుగా రీఛార్జ్ చేసుకోవాలి. అయితే వార్షిక పాస్‌ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. దాని చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత మీరు దానిని మళ్ళీ పునరుద్ధరించాలి. ఈ వార్షిక పాస్ జారీ చేసిన తర్వాత ప్రజలు టోల్ చెల్లించడానికి పొడవైన క్యూలలో నిలబడే ఇబ్బంది నుండి కూడా బయటపడతారు. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

ఇది కూడా చదవండి: Auto News: 6 ఎయిర్‌బ్యాగులు, బెస్ట్‌ మైలేజీ.. ధరం కేవలం రూ. 5.79 లక్షలు.. ఎప్పుడు నం 1గా నిలుస్తున్న కారు!

ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ ఆగస్టు 15, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే ఇది జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర రహదారులపై దీని ఉపయోగం చెల్లదు. ఈ చొరవ రవాణాను మరింత సౌకర్యవంతంగా, ఆర్థికంగా మారుస్తుందని భావిస్తున్నారు.

FASTag వార్షిక పాస్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి

ఆగస్టు 15 నుండి ఇప్పటికే ఉన్న FASTag వినియోగదారులు వార్షిక FASTag పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి రాజ్‌మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారిక వెబ్‌సైట్ (www.nhai.gov.in) లేదా www.morth.nic.in లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఇది తప్పనిసరియా?

ప్రతి ఒక్కరూ FASTag వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదా? ప్రతి ఒక్కరూ FASTag వార్షిక పాస్ పొందడం తప్పనిసరి కాదు. అయితే, రోజువారీ ప్రయాణికులు చెల్లించే టోల్ ఛార్జీలను తగ్గించడం దీని లక్ష్యం. వార్షిక పాస్ కొనడానికి ఇష్టపడని వారికి, వారి ప్రస్తుత FASTag యథాతథంగా పనిచేస్తుంది. టోల్ ప్లాజాలలో వర్తించే విధంగా వినియోగదారులు దీనిని సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Zelo Electric: 100 కి.మీ రేంజ్‌.. కేవలం రూ.60 వేలకే.. మార్కెట్‌ను షేక్‌ చేసే ఈవీ

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి