- Telugu News Photo Gallery Business photos Maruti Suzuki Wagonr Most Affordable Car Check Price Mileage and safety Details
Auto News: 6 ఎయిర్‌బ్యాగులు, బెస్ట్ మైలేజీ.. ధరం కేవలం రూ. 5.79 లక్షలు.. ఎప్పుడు నం 1గా నిలుస్తున్న కారు!
Auto News: ఈ కారు భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. దీని 1.0-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు సగటున 24.35 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అయితే దాని AMT వెర్షన్ లీటరుకు 25.19 కి.మీ..
Updated on: Aug 09, 2025 | 9:39 AM

Auto News: మారుతి సుజుకి ఇప్పుడు వ్యాగన్ ఆర్‌ను సురక్షితంగా మార్చింది. ఈ కారులోని ప్రతి వేరియంట్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిస్తుంది. ఇది ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. దీనితో పాటు ఇది ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో చాలా భద్రతా ఫీచర్స్ ఉండటం గమనార్హం.

మారుతి వ్యాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.79 లక్షల నుండి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 8.50 లక్షల వరకు ఉంటుంది. దీని CNG వేరియంట్ రూ. 7.15 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపిక. నగరం, వేరియంట్‌లను బట్టి ఆన్-రోడ్ ధరలు మారవచ్చు.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?: వాగన్ ఆర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ తో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీనితో పాటు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఆటో AC, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్, పనితీరు: మారుతి వ్యాగన్ ఆర్ మూడు వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందిస్తుంది. ఇది ప్రతి రకమైన కస్టమర్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన ఎంపికగా చేస్తుంది. మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 65.68 bhp శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవ ఎంపిక 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 88.5 bhp శక్తిని, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడవ ఎంపిక 1.0-లీటర్ CNG ఇంజన్. ఇది 88 PS శక్తిని, 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు 5-స్పీడ్ మాన్యువల్, ఏటీఎం ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతాయి. అయితే CNG వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఈ ఇంజన్ ఎంపికలన్నీ గొప్ప పనితీరును అలాగే అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి.

మైలేజ్: వ్యాగన్ ఆర్ భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. దీని 1.0-లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు సగటున 24.35 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అయితే దాని AMT వెర్షన్ లీటరుకు 25.19 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అదే సమయంలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 23.56 కి.మీ, AMT వేరియంట్ మైలేజ్ లీటరుకు 24.43 కి.మీ. ఇక సీఎన్‌జీ (CNG) వేరియంట్ కిలోకు 34.05 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటిగా నిలిచింది. తక్కువ ధర, గొప్ప మైలేజ్, నమ్మకమైన ఇంజిన్, ఇప్పుడు మునుపటి కంటే మెరుగైన భద్రతా లక్షణాల కారణంగా వ్యాగన్ R ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా ఉందని చెప్పవచ్చు.




