- Telugu News Photo Gallery Business photos Beware Free Credit Cards: Unseen Charges and High Interest Rates
ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే లాభమా? నష్టమా? పూర్తిగా తెలుసుకుంటే బతికిపోతారు..
ఫ్రీ క్రెడిట్ కార్డుల ఆఫర్లను చూసి మోసపోకండి. వాటికి అధిక వడ్డీ రేట్లు, విదేశీ లావాదేవీ ఫీజులు, ఓవర్ లిమిట్ ఫీజులు, ఆలస్య చెల్లింపు పెనాల్టీలు, ఇనాక్టివిటీ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు వంటి దాగి ఉన్న ఖర్చులు ఉంటాయి. కార్డును తీసుకునే ముందు ఈ అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి.
Updated on: Aug 08, 2025 | 8:12 PM

హలో సార్.. క్రెడిట్ కార్డ్ తీసుకోండి, మంచి లిమిట్‌తో వస్తుంది అంటూ కొంతమంది ఫోన్లు చేసి క్రెడిట్ కార్డులు అండగడుతుంటారు. ఫ్రీగానే వస్తుందంటూ కొంతమంది అలాంటి ఫ్రీ క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. కార్డు అయితే ఫ్రీగానే ఇస్తారు కానీ, దాని వెనుక కనిపించని హైడింగ్ ఛార్జీలు బాగానే ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అధిక వడ్డీ రేట్లు.. యానువల్ ఫీజు లేనప్పటికీ, ఈ కార్డులు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉండవచ్చు. తద్వారా మీ కార్డు వాడకం మరింత ఖరీదైనదిగా మారుతుంది. 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ విషయాన్ని గమనించండి.

విదేశీ లావాదేవీ మార్పిడి ఫీజు.. వార్షిక ఫీజు లేనప్పటికీ, ఈ కార్డులకు ఫారెక్స్ మార్క్-అప్ ఫీజు (2 నుండి 4 శాతం మధ్య) ఉండవచ్చు. ఇది యూఎస్ డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలో ఏదైనా ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం చెల్లింపు సమయంలో వసూలు చేస్తారు.

ఓవర్ లిమిట్ ఫీజు.. మీరు నగదు ఉపసంహరణను ఎంచుకున్నప్పుడు లేదా క్రెడిట్ లిమిట్ దాటి కార్డును ఉపయోగించినప్పుడు, బ్యాంకు దానిపై ఓవర్ లిమిట్ ఫీజును విధించవచ్చు. ఇది గుర్తుంచుకోవలసిన మరొక అంశం. ఆలస్య చెల్లింపు పెనాల్టీలు.. కార్డు జీవితకాలం ఉచితం అయినప్పటికీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించనప్పుడు ఆలస్య చెల్లింపు పెనాల్టీలు ఉండవచ్చు. ఇది ఇతర కార్డుల కంటే ఎంత ఎక్కువగా ఉందో చూసుకోవాలి.

ఇనాక్టివిటీ ఫీజులు.. కొంత మంది కార్డును తరచుగా ఉపయోగించరు. దీనికిగానూ కొన్ని కార్డు ప్రొవైడర్ సంస్థలు ఫీజు విధించవచ్చు. మునుపటి సంవత్సరంలో మొత్తం ఖర్చు ఒక పరిమితిని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు కొన్ని కార్డులకు వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు.. ఇది బ్యాంకులు విధించే సాధారణ ఫీజు కానప్పటికీ, ప్రాసెసింగ్ లేదా నిర్వహణ ఖర్చుల కోసమంటూ దీన్ని బ్యాంకులు చేస్తాయి. ఇది మీ కార్డుకు సాధారణంగానే ఉందా లేదా మరీ ఎక్కువగా ఉందా అన్న అన్న విషయాన్ని గమనించాలి.




