AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EDLI Scheme: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే రూ. 7 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే.!

EDLI Scheme Update: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే రూ. 7 లక్షలు పొందవచ్చు. పీఎఫ్ ఖాతాదారులకు, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లెస్...

EDLI Scheme: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే రూ. 7 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే.!
Epfo
Ravi Kiran
| Edited By: TV9 Telugu|

Updated on: May 07, 2024 | 11:55 AM

Share

EDLI Scheme Update: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే రూ. 7 లక్షలు పొందవచ్చు. పీఎఫ్ ఖాతాదారులకు, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లెస్ (ఈపీఎస్) చందాదారులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) గొప్ప సౌకర్యాన్ని అందిస్తోంది. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరూ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, 1976 (ఇడిఎల్ఐ) కింద ఇన్సూరెన్స్ పొందవచ్చు.

EDLI ప్రకారం, ప్రతి ఈపీఎఫ్ ఖాతాదారునికి రూ .7 లక్షల వరకు ఉచిత బీమా లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పథకం కింద ఉద్యోగులు ఎటువంటి వాయిదా లేదా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పీఎఫ్ కట్ లేదా పీఎఫ్ ఖాతా ఉన్నవారికి ఈ ప్రయోజనం ఆటోమాటిక్ గా లభిస్తుంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అసోసియేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగి కరోనాతో మరణించినట్లయితే.. సదరు వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఈ పథకం పరిమితి ఇంతకుముందు రూ .6 లక్షలు ఉండగా.. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ .7 లక్షలకు పెంచారు.

బీమా మొత్తాన్ని ఎప్పుడు,? ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు?

పీఎఫ్ ఖాతాదారుడు సహజ లేదా ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యం కారణంగా మరణించినట్లయితే.. సదరు వ్యక్తి కుటుంబసభ్యులు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. దీనికి బీమా సంస్థ మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రం, బ్యాంక్ వివరాలు జారీ చేయాల్సి ఉంటుంది. కరోనా కారణంగా మరణించిన సందర్భాలలో బంధువులు కూడా ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. వారసుడు లేకపోతే, చట్టబద్దమైన బంధువులు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి, కంపెనీకి సమర్పించిన ఫారంతో పాటు, ఇన్సూరెన్స్ కవర్ ఫారం (ఇన్సూరెన్స్ కవర్) – 5ఐఎఫ్ కూడా సమర్పించాలి. సదరు ఇన్సూరెన్స్ కంపెనీ వీటిని ధృవీకరించిన తర్వాత బీమా కవర్ ను చెల్లిస్తారు.

ఇవీ చదవండి:

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!