AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Gati shakti: ఆ పథకంతో దేశంలో అభివృద్ధి పరుగులు.. మౌలిక వసతులకు ప్రాధాన్యం

ఒక దేశం ప్రగతి పథంలో పయనించాలంటే సమర్థులైన పాలకులతో పాటు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు చాలా అవసరం. వాటిని సక్రమంగా అమలు చేసినప్పుడే ఫలితాలు కనిపిస్తాయి. అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో పీఎం గతి శక్తి - నేషనల్ మాస్టర్ ప్లాన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

PM Gati shakti: ఆ పథకంతో దేశంలో అభివృద్ధి పరుగులు.. మౌలిక వసతులకు ప్రాధాన్యం
Pm Gati Shakti
Nikhil
|

Updated on: Oct 23, 2024 | 4:15 PM

Share

గతేడాది అక్టోబర్‌లో అమలు చేసిన ఈ పథకం ద్వారా ఇన్ ఫ్రా ప్రాజెక్టులను సక్రమంగా అమలు పరిచి, లాజిస్టిక్ ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. దీని ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్లానింగ్, అమలు విషయంలో శాఖల మధ్య సమన్వయం కలుగుతుంది. రైల్వేలు, రోడ్డు మార్గాలు తదితర 16 రంగాలకు చెందిన అభివద్ది ప్రాజెక్టులను ఒక డిజిటల్ ప్లాట్ ఫాంపైకి తీసుకువచ్చింది. ప్రధాన మంత్రి గతి శక్తి పథకం ద్వారా అనేక కీలక మైన రంగాలలో విజయాలకు అడుగులు పడ్డాయి. దీని ద్వాారా ఇప్పటి వరకూ 180 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన 208 ప్రధాన మౌలిక సదుపాయాలను ప్రాజెక్టులను అంచనా వేశారు. 156 కీలకమైన మౌలిక సదుపాయాల అంతరాయాలను గుర్తించి, సరిదిద్దటానికి చర్యలు తీసుకున్నారు.

బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఆహారం పంపిణీ తదితర వాటికి సంబంధించి అనేక ముఖ్యమైన నిర్ణయాలు వెలువడ్డాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 8,891 కిలోమీటర్ల కొత్త రోడ్లకు ప్రణాళిక రూపొందించింది. రైల్వే మంత్రిత్వ శాఖ 27 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ కొత్త లైన్లను ఏర్పాటు చేయాలని మ్యాప్ ను సిద్ధం చేసింది. గుజరాత్ లో 300 కిలోమీటర్ల తీర ప్రాంత కారిడార్ రూపకల్పనకు గతిశక్తి ప్లాన్ సాయపడింది. ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) అనుమతుల సంఖ్యను 28 నుంచి 13కి తగ్గాయి. పీఎం గతి శక్తి పథకం ద్వాారా మౌలిక సదుపాయాాల పెట్టుబడులలో మంచి పెరుగుదల కనిపించింది. రాబోయే ఐదేళ్లలో పెట్టుబడుల సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 15.3 శాతం పెరగనుంది. అలాగే సంచిత వ్యయం 1.45 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.

ఈ పెట్టుబడులన్నీ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుదలకు దోహదపడతాయి. పీఎం గతిశక్తి ద్వారా జియో స్పెషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్), డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీని ఏకకరణ చేసి మౌలిక సదుపాయాల ప్రణాళికలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. భూమి, అడవులు, జాతీయ రహదారులు, పట్టణ కేంద్రాలు తదితర వాటిని టెక్నాలజీ కవర్ చేస్తుంది. తద్వారా ప్రాజెక్టుల ఆమోదం వేగవంతమవుతోంది. గతిశక్తి కి సంబంధించిన డిజిటల్ ఫ్రేమ్ వర్క్ తో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సామర్థ్యాన్ని, పారదర్శక పెరిగింది. వ్యాపార సంస్థల లాజిస్టిక్ ఖర్చులను తగ్గించుకోవడానికి సాయపడింది. దేశంలోని మౌలిక సదుపాయాల రంగానికి గతి శక్తి పథకం గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. ఇంటిగ్రేటెడ్, మల్టీ మోడల్ కనెక్టివిటీ పెంచడం, క్రాస్ సెక్టార్ సహకారం పెంపొందించడం, లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతోంది. తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి