AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India’s GDP Growth: క్రమంగా పైపైకి.. ఈ ఏడాది స్థిరంగా భారత ఆర్థిక వృద్ధి.. ఐఎంఎఫ్ తాజా అంచానా ఇదే..

కరోనా శకం ముగిసింది.. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది.. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది.. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారత వృద్ధి కీలక ప్రకటన చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను 7 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తూ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కీలక ప్రకటనచేసింది..

India’s GDP Growth: క్రమంగా పైపైకి.. ఈ ఏడాది స్థిరంగా భారత ఆర్థిక వృద్ధి.. ఐఎంఎఫ్ తాజా అంచానా ఇదే..
Indian Economy
Shaik Madar Saheb
|

Updated on: Oct 23, 2024 | 12:53 PM

Share

కరోనా శకం ముగిసింది.. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది.. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది.. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారత వృద్ధి కీలక ప్రకటన చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను 7 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తూ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) కీలక ప్రకటనచేసింది.. బలమైన ప్రభుత్వ వ్యయం – అధిక ఉత్పాదక పెట్టుబడులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత పుంజుకుంటుందని తెలిపింది. కరోనా కారణంగా ఏర్పడిన డిమాండ్ తగ్గిందని, ఆర్థికవ్యవస్థ తిరిగి కొవిడ్‌కు మునుపటి సామర్థ్యాన్ని పొందడంతో జూలైలో అంచనా వేసిన వృద్ధినే కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ వార్షిక సమావేశాలకుముందు వాల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యుఇఒ) రిపోర్ట్‌ విడుదల చేసింది. భారత్‌ ఈ ఏడాది (FY 2024-25) ఆర్థిక వృద్ధి 7 శాతంగా.. వచ్చే 2025-26లో 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ సందర్భంగా 2023-24లో భారత్‌ 8.2 శాతం వృద్ధిని సాధించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రపంచ వృద్ధి రేటును 2024, 2025 లోనూ 3.2 శాతంగా అంచనా వేసింది.

కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సరకుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై ప్రభావం కనిపిస్తోందని.. దీనివల్ల వృద్ధి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయని తెలిపింది. వస్తువుల ఉత్పత్తి, రవాణాకు అంతరాయాలు-ముఖ్యంగా చమురు-సంఘర్షణలు, పౌర అశాంతి, విపరీతమైన వాతావరణ సంఘటనలు.. మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ఉద్రిక్తతలు దీనిపై ప్రభావం చూపుతాయని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే.. రష్యా, భారతదేశం చాలా వరకు పుంజుకున్నాయని.. తెలిపింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీలో రేట్ల పెంపునకు దూరంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ద్రవ్యోల్బణం 4.4 శాతం ఉండవచ్చని, ఆ తర్వాత ఆర్థిక 2025-25లో 4.1 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. వృద్ధి అవకాశాలను పెంచేందుకు నిర్మాణాతమక సంస్కరణలు అవసరమని ఐఎంఎఫ్ అభిప్రాయపండింది..

రిజర్వ్ బ్యాంక్ అంచనా ఇదే..

ఇదిలాఉంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బలమైన దేశీయ డిమాండ్ నేపథ్యంలో FY25లో భారత ఆర్థిక వ్యవస్థ 7.2% వద్ద వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. జూన్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.6%కి పెంచింది.. బలమైన వృద్ధి ఊపందుకుంటున్నదని వెల్లడించింది.

7.2 శాతంతో వృద్ధి.. డెలాయిట్ ఇండియా

బలమైన ప్రభుత్వ వ్యయంతో FY25లో భారత ఆర్థిక వ్యవస్థ 7-7.2% వృద్ధి చెందుతుందని డెలాయిట్ తెలిపింది. బలమైన ప్రభుత్వ వ్యయం – అధిక ఉత్పాదక పెట్టుబడులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7-7.2 శాతం మధ్య వృద్ధి చెందుతుందని, అయితే ప్రపంచ వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరపు దృక్పథాన్ని ప్రభావితం చేస్తుందని డెలాయిట్ ఇండియా మంగళవారం తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..