AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024: దీపావళి అక్టోబర్‌ 31న లేదా నవంబర్‌ 1న.. బ్యాంకులకు సెలవు ఎప్పుడు? ఇదిగో క్లారిటీ!

ఈ ఏడాది దీపావళి పండుగను భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారనే దానిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీపావళి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం అమావాస్య అక్టోబర్ 31, గురువారం మధ్యాహ్నం..

Diwali 2024: దీపావళి అక్టోబర్‌ 31న లేదా నవంబర్‌ 1న.. బ్యాంకులకు సెలవు ఎప్పుడు? ఇదిగో క్లారిటీ!
Subhash Goud
|

Updated on: Oct 23, 2024 | 12:22 PM

Share

దీపావళి పండుగ దగ్గర పడుతోంది. దేశంలోని అతిపెద్ద పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఇది ప్రభుత్వ సెలవుదినం. ప్రతి సంవత్సరం దీపావళి నాడు బ్యాంకులు మూసి ఉంటాయి. దీపావళి తర్వాత పూజల పండుగ ప్రారంభమవుతుంది. ఛత్ పండుగ సందర్భంగా కూడా చాలా చోట్ల బ్యాంకులు మూసి ఉంటాయి. ఛత్ పూజను బీహార్, యుపిలో చాలా వైభవంగా జరుపుకుంటారు. అందుకే దీపావళి, ఛత్ కారణంగా బ్యాంకులు ఏ రోజు, ఎప్పుడు మూసివేయబడతాయో తెలుసుకుందాం. దీపావళి సందర్భంగా ఆర్బీఐ రెండు రోజులు సెలవు ఇచ్చింది. దేశంలో దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1?

ఇది కూడా చదవండి: Reliance: చివరి దశకు చేరుకున్న మరో భారీ ఒప్పందం.. రిలయన్స్‌కు సీసీఐ షరతు.. అదేంటంటే..

ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు?

ఈ ఏడాది దీపావళి పండుగను భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారనే దానిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీపావళి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం అమావాస్య అక్టోబర్ 31, గురువారం మధ్యాహ్నం 3:12 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 శుక్రవారం సాయంత్రం 5:53 వరకు ఉంటుంది. దీపావళి రోజున సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించి లక్ష్మీ పూజ చేసే సంప్రదాయం ఉంది. అయితే నవంబర్ 1 సాయంత్రం 6 గంటల లోపు అమావాస్య ముగియనుంది. అటువంటి పరిస్థితిలో అక్టోబర్ 31 న లక్ష్మీ పూజ జరుగుతుంది.

బ్యాంకులకు ఎప్పుడు సెలవు?

  • దీపావళి పర్వదినానికి ఆర్‌బీఐ రెండు రోజులు సెలవు ప్రకటించింది. ఆర్‌బిఐ అక్టోబర్ 31 గురువారం, నవంబర్ 1 శుక్రవారం సెలవులు ఇచ్చింది. అమావాస్య, లక్ష్మీ పూజ కోసం భారతదేశంలోని అన్ని బ్యాంకులు రెండు రోజుల పాటు మూసి ఉంటాయి.
  • 31 అక్టోబర్- దీపావళి / కాళీ పూజ / సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు / నరక్ చతుర్దశి – త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, మహారాష్ట్ర, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  • నవంబర్ 1 – దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ)/కుట్/కన్నడ రాజ్యోత్సవం – త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయలలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • నవంబర్ 2 – బలిపద్మి / లక్ష్మీ పూజ (దీపావళి) / గోవర్ధన్ పూజ / విక్రమ్ సంవత్ న్యూ ఇయర్ రోజు – గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో బ్యాంకులు మూసివేయబడతాయి.
  • నవంబర్ 7 – ఛత్ (సాయంత్రం అర్ఘ్య) – పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
  • నవంబర్ 8 – ఛత్ (ఉదయం అర్ఘ్య)/వంగల ఉత్సవ్ – బీహార్, జార్ఖండ్, మేఘాలయలో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Indian Railway: రైలులో బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లు నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు? రైల్వేశాఖ సమాధానం వింటే షాకవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి