BSNL New Logo: బీఎస్‌ఎన్‌ఎల్ లోగో మారింది.. యూజర్ల కోసం సరికొత్త నిర్ణయాలు!
దేశంలో సొంత టెక్నాలజీతో 4జీ సేవలు అందుంబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అంతేకాదు 5జీని కూడా వచ్చే ఏడాదిలో దేశ వ్యాప్తంగా అమలు అయ్యేలా పనులు కూడా శర వేగంగా కొనసాగుతున్నాయి..
భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇప్పుడు మరింత పాపుల్ అవుతోంది. గతంలో వెలుగు వెలిగి ఒక్కసారిగా పడిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు ఒక్కసారిగా లేచింది. కారణంగా ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల టారీఫ్ ప్లాన్స్ పెంచడమే. ఈ సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచినా.. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదు. దీంతో చాలా మంది వినియోగదారులు తమ నంబర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ పెట్టుకుంటున్నారు. దేశంలో సొంత టెక్నాలజీతో 4జీ సేవలు అందుంబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అంతేకాదు 5జీని కూడా వచ్చే ఏడాదిలో దేశ వ్యాప్తంగా అమలు అయ్యేలా పనులు కూడా శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ లోగోలో మార్పులు చేసింది. కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ లోగోలో రంగుల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్‌లో 4 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లోగోలో కాషాయం, తెలుపు, గ్రీన్ కలర్స్‌తో లోగోను రూపొందించింది.
ఇది కూడా చదవండి: Diwali 2024: దీపావళి అక్టోబర్ 31న లేదా నవంబర్ 1న.. బ్యాంకులకు సెలవు ఎప్పుడు? ఇదిగో క్లారిటీ!
గతంలో రెడ్, బ్లూ, యాష్ కలర్స్‌తో లోగో ఉండగా, ఇప్పుడు ఆ లోగోలో మార్పులు చేసింది. అంతేకాకుండా వినియోగదారులకు మరింత తగ్గరయ్యేలా చౌకైన రీఛార్జ్ ధరలను ప్రకటిస్తూ, కొత్త ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిన స్పామ్ మెసేజ్‌లతో పాటు స్కామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్.
వైఫై రోమింగ్:
ఇదిలా ఉండగా, బీఎస్‌ఎన్‌ఎల్ తన ఫైబర్ ఇంటర్నెట్ యూజర్ల కోసం నేషనల్ వైఫై రోమింగ్ సర్వీలను ప్రారంభించింది. దాంతో యూజర్లు అదనపు ఛార్జీలు లేకుండా బీఎస్‌ఎన్‌ఎల్ హాట్‌స్పాట్స్‌లలో హైస్పీడ్ సేవలను పొందేందుకు అవకాశం కల్పించింది. దాంతో డేటా ఖర్చులు తగ్గుతాయని కంపెనీ చెబుతోంది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ 500కిపైగా లైవ్ ఛానెల్స్, పే టీవీ ఆప్షన్స్‌ని కలిగి ఉన్న కొత్త ఫైబర్ ఆధారిత టీవీ సర్వీసులను సైతం ప్రకటించింది. ఫైబర్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్లందరికీ అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. మైనింగ్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు సీ-డీఏసీతో బీఎస్‌ఎన్‌ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త నెట్‌వర్క్ స్వదేశీ సాంకేతికను ఉపయోగించనుంది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రైబర్‌ల కోసం మరో కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రత్యేకమైన మొబైల్ నంబర్‌లను పొందే అవకాశం కల్పిస్తుంది.
BSNL proudly unveils its new logo, symbolizing trust, strength, and nationwide reach. Along with this, BSNL introduces seven pioneering initiatives aimed at enhancing digital security, affordability, and reliability, transforming the way India connects with secure, seamless, and… pic.twitter.com/osVhwFrozw
— DD India (@DDIndialive) October 22, 2024
ఎనీ టైమ్ సిమ్ (ATS) కియోస్క్‌లతో కొత్త BSNL SIM కార్డ్‌లను కొనుగోలు చేయడం కూడా సులభతరం చేస్తోంది. ఇవి స్వయంచాలకంగా పంపిణీ చేయగలవు. KYCని పూర్తి చేసి సిమ్ కార్డులను అందిస్తుంది. టెల్కో భూమి, గాలి, సముద్రంపై పనిచేసే SMS సేవల కోసం భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం నుండి పరికరానికి కనెక్టివిటీ వంటి అదనపు సేవలను కూడా అందిస్తోంది. అదేవిధంగా విపత్తు నిర్వహణ కోసం ఒకే వన్-టైమ్ సొల్యూషన్ నెట్‌వర్క్ సేవను కూడా ప్రకటించింది. BSNL మైనింగ్ రంగానికి సురక్షితమైన 5G నెట్‌వర్క్‌ను కూడా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Indian Railway: రైలులో బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లు నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు? రైల్వేశాఖ సమాధానం వింటే షాకవుతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి