BSNL VIP Number: మీకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యాన్సీ నంబర్‌ కావాలా? ఇలా దరఖాస్తు చేసుకోండి!

BSNL తన వినియోగదారుల కోసం ఫ్యాన్సీ నంబర్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో వినియోగదారులు తమకు నచ్చిన VIP మొబైల్ నంబర్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందుకోసం టెలికాం కంపెనీ ఈ-వేలం షరతు విధించింది. మీరు కూడా బీఎస్ఎన్‌ఎల్‌ నుండి మీకు..

BSNL VIP Number: మీకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యాన్సీ నంబర్‌ కావాలా? ఇలా దరఖాస్తు చేసుకోండి!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 22, 2024 | 9:00 PM

BSNL తన వినియోగదారులకు ఫ్యాన్సీ మొబైల్ నంబర్లను అందిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ ప్రతి అంశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టోల్‌, వోడాఫోన్‌ ఐడియాలతో పోటీ పడుతోంది. జూలైలో ప్రైవేట్ కంపెనీల ప్లాన్‌లు ఖరీదైనవి కావడంతో లక్షల మంది వినియోగదారులు తమ నంబర్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ 4జీ సేవలను అందించేందుకు కంపెనీ యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. కంపెనీ వేలకొద్దీ కొత్త మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేసింది. దీని కారణంగా వినియోగదారులు మెరుగైన కనెక్టివిటీని పొందుతున్నారు. దీంతోపాటు వచ్చే ఏడాది జూన్ నాటికి 5జీ సర్వీసును కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

BSNL తన వినియోగదారుల కోసం ఫ్యాన్సీ నంబర్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో వినియోగదారులు తమకు నచ్చిన VIP మొబైల్ నంబర్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందుకోసం టెలికాం కంపెనీ ఈ-వేలం షరతు విధించింది. మీరు కూడా బీఎస్ఎన్‌ఎల్‌ నుండి మీకు నచ్చిన నంబర్ కావాలనుకుంటే మీరు ఇ-వేలంలో పాల్గొనడం ద్వారా మీ నంబర్‌ను బుక్ చేసుకోవచ్చు. BSNL చెన్నై తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. దేశంలోని వివిధ టెలికాం సర్కిల్‌ల వినియోగదారులు అక్టోబర్ 28 వరకు తమకు కావాల్సిన నంబర్‌ను బుక్ చేసుకోవచ్చు.

BSNL ఇ-వేలం నిబంధనలు:

ఈ-వేలంలో పాల్గొనడం ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను ఎంచుకోవచ్చు. VIP నంబర్ పొందడాని, వినియోగదారులు భారతీయ పౌరసత్వం కలిగి ఉండటం తప్పనిసరి. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. బిడ్డింగ్‌లో అర్హత సాధించిన తర్వాత దానిని మార్చలేరు లేదా రద్దు చేయలేరు. సంఖ్యల బిడ్డింగ్ H1, H2 లేదా H3 కేటగిరీలో జరుగుతుంది. బిడ్డింగ్‌లో పాల్గొనే వినియోగదారులకు రహస్య పిన్ వెల్లడిస్తారు. వినియోగదారులు బిడ్డింగ్‌ను గెలవకపోతే, వారి రిజిస్ట్రేషన్ రుసుము తదుపరి 10 రోజులలోపు తిరిగి చెల్లిస్తారు.

ఎలా పాల్గొనాలి?

  • దీని కోసం మీరు BSNL వెబ్‌సైట్ (https://eauction.bsnl.co.in/)కి వెళ్లాలి.
  • దీని తర్వాత మీ టెలికాం సర్కిల్‌ని ఎంచుకుని, వివరాలు నమోదు చేసుకోండి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అవసరమైన సమాచారాన్ని పూరించి కొనసాగండి.
  • తదుపరి పేజీలో మీరు వేలం వేయడానికి అందుబాటులో ఉన్న VIP నంబర్‌ల జాబితాను చూస్తారు.
  • మీరు మీకు నచ్చిన నంబర్‌ని ఎంచుకుని, చెల్లింపు చేయండి.
  • బిడ్డింగ్‌కు అర్హత సాధించిన తర్వాత, మీ బిడ్ విజయవంతమైతే, ఎంచుకున్న VIP నంబర్ మీకు కేటాయిస్తారు. లేదంటే రిజిస్ట్రేషన్ ఫీజు మీకు వాపసు అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి