AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం రూ.11 లక్షలకే ఫ్లాట్‌..! అది కూడా రాజధానిలో.. నవంబర్‌ 7న బుకింగ్‌ షురూ!

DDA జన్ సాధారణ్ ఆవాస్ యోజన 2025 ఫేజ్-2ను EWS, LIG వర్గాల కోసం ప్రారంభించింది. నవంబర్ 7, 2025 నుండి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఈ ఫ్లాట్‌లు నరేలా, రోహిణి, రామ్‌ఘడ్ కాలనీ, శివాజీ మార్గ్‌లలో రూ. 11.8 లక్షల నుండి రూ. 32.7 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.

కేవలం రూ.11 లక్షలకే ఫ్లాట్‌..! అది కూడా రాజధానిలో.. నవంబర్‌ 7న బుకింగ్‌ షురూ!
Dda Ews Lig Flats Delhi
SN Pasha
|

Updated on: Oct 27, 2025 | 7:02 PM

Share

జన్ సాధారణ్ ఆవాస్ యోజన ఫేజ్-1 సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), దిగువ ఆదాయ సమూహం (LIG) కోసం మరో గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఈ వ్యక్తుల కోసం DDA జన్ సాధారణ్ ఆవాస్ యోజన 2025 ఫేజ్-2ను ప్రకటించింది. ఈ కొత్త పథకం కింద ఫ్లాట్‌ల బుకింగ్ నవంబర్ 7, 2025న మధ్యాహ్నం 12.00 గంటల నుండి ప్రారంభమవుతుంది.

DDA ఫ్లాట్లు ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి మీరు DDA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా ఈ లింక్‌(https://eservices.dda.org.in)పై క్లిక్‌ చేసినా సైట్‌లోకి వెళ్లవచ్చు. EWS, LIG కేటగిరీలలోని ఈ ఫ్లాట్ల ధరలు రూ.11.8 లక్షల నుండి రూ.32.7 లక్షల వరకు ఉంటాయి.

ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి

DDA నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ ఫ్లాట్‌లు ఢిల్లీలోని నరేలా, రోహిణి, రామ్‌గఢ్ కాలనీ, శివాజీ మార్గ్‌లలో అందుబాటులో ఉన్నాయి. EWS కేటగిరీ ఫ్లాట్‌లు నరేలా, శివాజీ పార్క్ (మోతీ నగర్ సమీపంలో)లలో అందుబాటులో ఉండగా, LIG ​​కేటగిరీ ఫ్లాట్‌లు రోహిణి సెక్టార్‌లు 34, 35, రామ్‌గఢ్ కాలనీ (జహంగీర్‌పురి సమీపంలో)లో అందుబాటులో ఉంటాయి.

నరేలాలో 1,120 ఫ్లాట్లు ఉన్నాయి, వాటి పరిమాణాలు 34.8 నుండి 35.1 చదరపు మీటర్ల వరకు ఉన్నాయి. ఈ ఫ్లాట్ల ధరలు రూ. 13.7 లక్షల నుండి రూ. 13.8 లక్షల మధ్య ఉన్నాయి. అయితే, 15 శాతం తగ్గింపు ఉంది, దీని తర్వాత, ధర రూ. 11.8 లక్షల నుండి రూ. 11.9 లక్షల మధ్య ఉంటుంది. రోహిణిలోని 34, 35 సెక్టార్లలో మొత్తం 308 LIG ఫ్లాట్లు ఉన్నాయి, వాటి సైజులు 33.3 నుండి 33.9 చదరపు మీటర్లు. ఈ ఫ్లాట్ల ధర రూ. 14 లక్షల నుండి రూ. 14.2 లక్షల మధ్య ఉంది, వీటికి డిస్కౌంట్ లేదు.

రామ్‌ఘర్ కాలనీలో 31.9 నుండి 35.3 చదరపు మీటర్లు వరకు ఉంది. ఈ ఫ్లాట్ల ధర రూ. 15.3 లక్షల నుండి రూ. 16.9 లక్షల మధ్య ఉంది. అయితే, 15 శాతం డిస్కౌంట్ తర్వాత, వాటి ధరలు రూ. 13.1, రూ. 14.5 లక్షల మధ్య తగ్గుతాయి. శివాజీ మార్గ్‌లో మొత్తం 36 EWS ఫ్లాట్లు ఉన్నాయి, వీటి సైజు 33.1 నుండి 45.1 చదరపు మీటర్లు వరకు ఉంది. ఈ ఫ్లాట్ల ధర రూ. 25.2 లక్షల నుండి రూ. 32.7 లక్షల మధ్య ఉంది, వీటికి డిస్కౌంట్ లేదు. DDA జన్ సాధరన్ ఆవాస్ యోజన 2025 దశ 2 కింద, LIG ​​ఫ్లాట్ బుకింగ్ మొత్తం రూ.లక్ష కాగా, EWS ఫ్లాట్ కోసం మీరు రూ.50,000 చెల్లించాలి. ఈ ఫ్లాట్‌లు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన అమ్ముతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి