Credit Card: భారీగా పెరిగిన క్రెడిట్‌ కార్డుల వాడకం.. ఎందుకో తెలుసా..?

కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్‌ లావాదేవీలు జోరందుకున్నాయి. టెక్నాలజీ పెరుగుతుండటంతో బ్యాంకింగ్‌ సేవలు మరింత సులభతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో..

Credit Card: భారీగా పెరిగిన క్రెడిట్‌ కార్డుల వాడకం.. ఎందుకో తెలుసా..?
Credit Card
Follow us

|

Updated on: Mar 10, 2023 | 7:51 PM

కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్‌ లావాదేవీలు జోరందుకున్నాయి. టెక్నాలజీ పెరుగుతుండటంతో బ్యాంకింగ్‌ సేవలు మరింత సులభతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డులు వినియోగించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. గ‌త జ‌న‌వ‌రి నెల‌లో క్రెడిట్ కార్డు లావాదేవీలు 29.6 శాతం పెరిగి ఆల్‌టైం రికార్డు స్థాయిలో రూ.1.87 ల‌క్ష‌ల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక గత ఏడాది అంటే 2022 జనవరిలో క్రెడిట్ కార్డుల వాడ‌కం దాదాపు 10 శాతం మాత్ర‌మే ఉండగా, 2022 జ‌న‌వ‌రిలో రూ.1,41,254 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇక 2023 జ‌న‌వ‌రిలో రూ.1,86,783 కోట్ల‌కు పెరిగింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం 10 నెల‌ల్లో క్రెడిట్ కార్డుల వాడకం 20 శాతానికి పైగా పెరిగింద‌ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదికలో పేర్కొంది. అత్య‌ధికంగా గ‌త జూన్‌లో 30.7 శాతం లావాదేవీలు జ‌రిగాయని తెలిపింది.

ప్రస్తుతం లావాదేవీలు డిజిటలైజ్డ్‌ కావడంతో క్రెడిట్‌ కార్డు వాడకందారుల ఖర్చులు కూడా పెరిగాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చెల్లింపులు సులభతరం కావడంతో హెల్త్‌, ఫిట్‌నెస్‌, ఎడ్యుకేష‌న్‌, యుటిలిటీ బిల్లులు, త‌దిత‌ర లావాదేవీల ఖ‌ర్చులు పెరిగిపోయాయ‌ని చెబుతున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా క్రెడిట్ కార్డుల లావాదేవీలు కూడా పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో రూ.1.26 ల‌క్ష‌ల కోట్ల లావాదేవీలు న‌మోదైతే, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో రూ.1.28 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయ‌ని చెబుతున్నారు.

8.25 కోట్ల క్రెడిట్‌ కార్డులు జారీ

గ‌త జ‌న‌వ‌రి నెల చివరి నాటికి వివిధ బ్యాంకులు దాదాపు 8.25 కోట్ల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డులు జారీ చేసిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకులు టాప్‌-5 స్థానాల్లో నిలిచాయి. చాలా మంది క్రెడిట్ స్కోర్ పెంచుకోవ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..