AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Blunders : కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యారా, అయితే ఈ మిస్టేక్స్ చేశారో ఫైనాన్షియల్ గా బాగా నష్టపోయే చాన్స్

కొత్తగా జాబ్ లో చేరారా, అయితే కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, క్రమశిక్షణతో ఉంటేనే జీవితంలో మంచి స్థాయిని అందుకుంటారు.

Financial Blunders  : కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యారా, అయితే ఈ మిస్టేక్స్ చేశారో ఫైనాన్షియల్ గా బాగా నష్టపోయే చాన్స్
vastu
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 10, 2023 | 8:06 AM

Share

కొత్తగా జాబ్ లో చేరారా, అయితే కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, క్రమశిక్షణతో ఉంటేనే జీవితంలో మంచి స్థాయిని అందుకుంటారు. ముఖ్యంగా 30 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టేటప్పుడు మనం తరచుగా చేసే తప్పులను అర్థం చేసుకోవాలి. కొత్త ఫైనాన్షియల్ సంవత్సరం ప్రారంభం కానుంది. అందుకే మీరు కొన్ని ఆర్థిక రిజల్యూషన్‌ను తప్పనిసరిగా తీసుకోవడం చాలా ముఖ్యం. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు, ఖచ్చితంగా ఈ లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడండి.

పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి:

చాలా మంది పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెడుతుంటారు. ఎక్కువ రాబడిని పొందడం కోసం పెట్టుబడి పెట్టడం తరచుగా చూస్తుంటాం. అయితే, ఈ తప్పు చేయవద్దు. ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. కాబట్టి మీ పెట్టుబడిని ప్రారంభించడానికి ముందు మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోండి.

ఇవి కూడా చదవండి

క్రెడిట్ స్కోర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి:

చాలా మంది తమ క్రెడిట్ స్కోర్‌ను చాలా కాలం పాటు తనిఖీ చేయకపోవడం లాంటి పొరపాట్లు చేస్తుంటారు. చాలా మంది రుణం లేదా క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు మాత్రమే క్రెడిట్ స్కోర్ చూసుకుంటారు. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ అలవాటును మార్చుకోండి. మీరు ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేయాలి. ఇది మీ క్రెడిట్ స్కోర్ ఎంత మెరుగైంది లేదా ఎందుకు తక్కువగా ఉందో చూపిస్తుంది. అయితే పదే పదే చూసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదం ఉంటుంది.

క్రెడిట్ కార్డ్, EMI చెల్లింపు డిఫాల్ట్ చేయకండి:

మీరు మీ క్రెడిట్ కార్డ్ లేదా లోన్ EMI చెల్లింపు డేట్ మిస్ అయినట్లయితే, అది క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. ఇది మీ క్రెడిట్ హిస్టరీని పాడు చేస్తుంది. భవిష్యత్తులో, మీరు రుణం తీసుకోవాలనుకుంటే లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, అప్పుడు అందులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరంలో, మీరు మీ చెల్లింపులను సకాలంలో చేసేలా ప్లాన్ చేసుకోండి.

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను మెయిన్ టెయిన్ చేయొద్దు:

అవసరాల కంటే ఎక్కువ అప్పు తీసుకోవడం అంత మంచిది కాదు. అలాగే ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం కూడా తప్పే. బహుళ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం అనే తప్పును సరిదిద్దుకోవాలి. మీకు అవసరమైన ఒక క్రెడిట్ కార్డు మాత్రమే ఉంచుకోండి. ఎందుకంటే తిరిగి చెల్లింపు కోసం మీపై ఒత్తిడి ఉండకూడదు. క్రెడిట్ కార్డ్‌లను ఎక్కువగా కలిగి ఉండటం వలన సకాలంలో బిల్లులను చెల్లించడం కష్టం. ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా నెగిటివ్ ప్రభావం చూపుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం