AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coca Cola Company: 35 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించనున్న కోకా-కోలా కంపెనీ.. కారణం ఏంటంటే..

శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోలా పాలక్కాడ్ జిల్లాలోని ప్లాచిమడలో తన 35 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం కోకాకోలా కంపెనీ చర్చల ప్రక్రియను ప్రారంభించింది. సీఎంవో ఒక ప్రకటన ప్రకారం.. హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్..

Coca Cola Company: 35 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించనున్న కోకా-కోలా కంపెనీ.. కారణం ఏంటంటే..
Coca Cola Company
Subhash Goud
|

Updated on: Apr 21, 2023 | 2:24 PM

Share

శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోలా పాలక్కాడ్ జిల్లాలోని ప్లాచిమడలో తన 35 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం కోకాకోలా కంపెనీ చర్చల ప్రక్రియను ప్రారంభించింది. సీఎంవో ఒక ప్రకటన ప్రకారం.. హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆఫీసర్ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ ట్రోవాటో, రాష్ట్రానికి ఆస్తి, భవనాన్ని అప్పగించాలనే కంపెనీ నిర్ణయాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ పంపారు.

రైతుల నేతృత్వంలోని ప్రతిపాదిత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO) కోసం భూమిని విడుదల చేయడానికి కోకా-కోలా కంపెనీ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. విద్యుత్ శాఖ మంత్రి కేఈ కృష్ణంకుట్టి నేతృత్వంలో జరిగిన చర్చల ప్రారంభంలోనే శీతల పానీయాల తయారీదారుడు భూమిని బదిలీ చేసేందుకు అంగీకరించారు. అక్కడి రైతులకు డెమో ఫామ్ ఏర్పాటు చేసేందుకు సాంకేతిక సహకారం అందించడానికి కంపెనీ ముందుకొచ్చింది.

2004లో ప్లాంట్‌ను మూసివేశారు:

భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం వల్ల పర్యావరణం కలుషితమవుతోందని ఆరోపిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో 2004 మార్చి నెలలో ఈ కంపెనీ మూతపడింది.

ఇవి కూడా చదవండి

ఈ భూమిపై ప్రభుత్వం 1.1 కోట్లు వెచ్చించింది

కేరళ ప్రభుత్వం కోకాకోలా అభ్యర్థన మేరకు 2021లో వివాదాస్పద భూమిని కోవిడ్ సమయంలో పేషెంట్ల కోసం వినియోగించారు. కోకాకోలా అవసరమైన మరమ్మతు పనులను పూర్తి చేసి యూనిట్‌ను ప్రభుత్వానికి అప్పగించింది. తదనంతరం, 2021లో కేరళ ప్రభుత్వం పాలక్కాడ్‌లోని కోకాకోలా ప్లాంట్‌ను 550 పడకల కోవిడ్‌-19 చికిత్సా కేంద్రంగా మార్చడానికి రూ.1.1 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 100 ఆక్సిజన్ బెడ్‌లు, 50 ఐసీయూ బెడ్‌లు, 20 వెంటిలేటర్లను సాధారణ ప్రజల చికిత్స కోసం తయారు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి