కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ జర్నీ సేఫ్..
ఎండాకాలంలో కారు టైర్లు పేలడం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఇలాంటి ప్రమాదాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో రోడ్ల నాణ్యత పెరగడం, హైవేలు పెరగడంతో రోడ్డెక్కిన ప్రతి కారు హై స్పీడ్‌తో తీసుకెళ్తుంది. అయితే స్పీడ్‌గా వెళ్లడం ఈ ప్రమాదానికి కారణమా అంటే కచ్చితంగా కాదు.
ఎండాకాలంలో కారు టైర్లు పేలడం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఇలాంటి ప్రమాదాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో రోడ్ల నాణ్యత పెరగడం, హైవేలు పెరగడంతో రోడ్డెక్కిన ప్రతి కారు హై స్పీడ్‌తో తీసుకెళ్తుంది. అయితే స్పీడ్‌గా వెళ్లడం ఈ ప్రమాదానికి కారణమా అంటే కచ్చితంగా కాదు. తమ వాహనానికున్న టైర్ ఎంత స్పీడ్ వరకు వెళ్లొచ్చు అనే విషయం తెలియకుండా వెళ్లడమే ప్రాణాల మీదికి వస్తుంది. మీ కారుకున్న టైరు నాణ్యత, స్పీడ్, లోడింగ్ కెపాసిటీ ఎంతో మీకు తెలుసా. కారు సామర్థ్యాన్ని బట్టి ఆ స్పీడ్‌లో వెళుతుంటారు. కానీ అందుకు సూటబుల్ టైర్లు ఉన్నాయా లేదో ఎప్పుడైనా చూసుకున్నారా ? అయితే ఇలా తెలుసుకోండి.
- మీ వాహనం నాలుగు టైర్లను ఒకసారి పరిశీలించండి. 4 ఒకే మోడల్ టైర్లను మెయింటైన్ చేస్తే పర్వాలేదు. వేర్వేరుగా ఉన్నట్లయితే మార్చుకోవడానికి ప్రయత్నించండి. కారు టైర్ల మీద ఉన్న అక్షరాలని ఒకసారి ఫోటో తీయండి. ఆ తర్వాత పైన ఇచ్చిన చార్టులతో మీ టైరు కెపాసిటీని అంచనా వేయండి. మొదటగా ఉండే ఐదు అక్షరాలు మీ టైర్ విడ్త్, రేషియో సూచిస్తాయి. ఆ తర్వాత ఉండేది రింగ్ సైజ్ డయామీటర్. ఇక ఆ తర్వాత ఉండే చివరి మూడు అక్షరాలే మోస్ట్ ఇంపార్టెంట్.
- చివరి మూడు అక్షరాల్లో ఉండే మొదటి రెండు అక్షరాలు మీ టైర్ కెపాసిటీని చూపిస్తాయి. అంతకుమించి ఒక్కో టైరుపైన మ్యాక్సిమం బరువు మోయలేదని అర్థం. పైన చార్ట్‌లో మీ టైరు సైజు దానికి సంబంధించిన మాక్సిమం వెయిట్ ఉంటుంది. దానిని ఒకసారి చెక్ చేయండి.
- ఇక తర్వాత చివర్లో L నుంచి Y వరకు ఇంగ్లీష్ అక్షరాల్లో ఏదో అక్షరం ఉంటుంది. అది అది మీరు వెళ్లాల్సిన మాక్సిమం స్పీడును సూచిస్తుంది. మీ టైర్లకు సరిపడా స్పీడును మెయింటైన్ చేయకపోతే పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
- మీ కారు ప్రయాణించే స్పీడు ఎంత, లోపల ఉన్న లోడ్ ఎంత అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయడం ఎప్పుడు సేఫ్.
- లోపల ఎన్ని ఎయిర్ బ్యాగ్లు ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉన్న, సేఫ్టీ ఫీచర్లు ఉన్న టైర్లు పలికితే జరిగే ప్రమాదాన్ని నివారించడం చాలా కష్టం.
సాధారణంగా టైర్లు బాగున్నాయి ఎంత స్పీడ్ అయినా వెళ్లొచ్చు అని అందరు భావిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్త టైర్లు కూడా పగిలిపోవడం గమనిస్తున్నాం. ఎందుకు కారణం ఇలాంటి విషయాలు తెలియకపోవడమే. టైర్ల కంపెనీలు కూడా సేల్స్ మార్కెటింగ్‌పై పెట్టిన దృష్టి కస్టమర్లను ఈ అంశాలపై అవగాహన కల్పించడంపై కొంచ కూడా పెట్టకపోవడం దురదృష్టం. టైర్లు కొనేటప్పుడే దాంతోపాటు ఒక మాన్యువల్, లేదా కనీసం ఒక పేపర్ మీద అయినా ఈ విషయాలు ప్రింట్ చేసి ఇస్తే చాలా ప్రమాదాలను అరికట్టవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..