Ola S1X: ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు.. కేవలం రూ.70 వేలకు ఓలా స్కూటర్ మీ సొంతం

ఇకపై ఓలా ఎస్1ఎక్స్ ఈవీ స్కూటర్లను రూ. 69,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ధరల తగ్గింపుతో ప్రస్తుతం పెట్రోల్ స్కూటర్లు అయిన స్ప్లెండర్ ప్లస్, హోండా యాక్టివా కంటే తక్కువ ధరకే ఓలా స్కూటర్లను సొంతం చేసుకోవచ్చు. ఎస్ 1 ఎక్స్ అనేది ఓలా కంపెనీకు సంబంధించిన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణి, బ్యాటరీ కాన్ఫిగరేషన్‌పై ఆధారపడి మూడు వేరియంట్‌లతో లభిస్తుంది.

Ola S1X: ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు.. కేవలం రూ.70 వేలకు ఓలా స్కూటర్ మీ సొంతం
Ola S1x
Follow us

|

Updated on: Apr 19, 2024 | 3:29 PM

దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ఓలా ఎస్ 1 ఎక్స్ శ్రేణికి ధర తగ్గింపులను ప్రకటించింది. ఇకపై ఓలా ఎస్1ఎక్స్ ఈవీ స్కూటర్లను రూ. 69,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ధరల తగ్గింపుతో ప్రస్తుతం పెట్రోల్ స్కూటర్లు అయిన స్ప్లెండర్ ప్లస్, హోండా యాక్టివా కంటే తక్కువ ధరకే ఓలా స్కూటర్లను సొంతం చేసుకోవచ్చు. ఎస్ 1 ఎక్స్ అనేది ఓలా కంపెనీకు సంబంధించిన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణి, బ్యాటరీ కాన్ఫిగరేషన్‌పై ఆధారపడి మూడు వేరియంట్‌లతో లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఓలా ఎస్1 ఎక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఓలా ఎక్స్ 1 ఎక్స్ మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఓలా ఎస్ 1 ఎక్స్ 2 కేడబ్ల్యూహెచ్, ఓలా ఎస్ 1 ఎక్స్ 3 కేడబ్ల్యూహెచ్, ఓలా ఎస్ 1 ఎక్స్ 4 కేడబ్ల్యూహెచ్ వేరియంట్స్‌లో లభ్యం కానుంది. తగ్గించిన ధర కారణంగా ఓలా ఎస్ 1 ఎక్స్ 2 కేడబ్ల్యూహెచ్ ఇప్పుడు కేవలం రూ. 69,999 (ఎక్స్-షోరూమ్, ఇంట్రడక్టరీ) పొందవచ్చు. అలాగే ఓలా ఎస్ 1 ఎక్స్ 3 కేడబ్ల్యూహెచ్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్), ఓలా ఎస్ 1 ఎక్స్ 4 కేడబ్ల్యూహెచ్ ధర రూ. 99,999 కు పొందవచ్చు. ఓలా ఎస్ 1 ఎక్స్ 2 కేడబ్ల్యూహెచ్, 4 డబ్ల్యూహెచ్ ధరలను రూ. 10,000, 3 కేడబ్ల్యూహెచ్ ధరను రూ. 5,000 తగ్గించింది. ఈ ధరలను పోల్చి చూస్తే హీరో స్ప్లెండర్ + మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 75,441 (ఎక్స్-షోరూమ్), హోండా యాక్టివా స్కూటర్ రూ. 76,234 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.  వీటికంటే తక్కువ ధరకే లభించనుంది. ఓలా ఎస్ 1 ఎక్స్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న వారు వచ్చే వారం నుంచి డెలివరీలను పొందవచ్చు. 

ఓలా ఎస్ 1 ఎక్స్ 2 కేడబ్ల్యూహెచ్ మొత్తం లైనప్‌లో అత్యంత సరసమైన మోడల్‌గా ఉందని బిజినెస్ నిపుణులు చెబుతున్నాు. ఇది 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే 6 కేడబ్ల్యూ హబ్ మోటార్‌ ద్వారా వస్తుంది. ఈ స్కూటర్‌లో మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లో డ్రైవ్ చేయవచ్చు. ఏఆర్ఏఐ ధ్రువీకరించిన పరిధి ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 95 కిలోమీటర్లుగా క్లెయిమ్ చేయబడినప్పటికీ నిజమైన పరిధి ఎకో మోడ్‌లో 84కిమీగా ఉంటే సాధారణ మోడ్‌లో 71కిమీగా ఉంది. ఓలా ఎస్ 1 ఎక్స్  2 కేడబ్ల్యూహెచ్ గరిష్ట వేగం 85 కిలోమీటర్లుగా ఉంది. అలాగే ఈ స్కూటర్ 4.1 సెకన్స్‌లో 0-40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనుంది. అలాగే 8.1 సెకన్స్‌లో 0-60 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి 100 శఆతం ఛార్జ్ కోసం, ఎలక్ట్రిక్ స్కూటర్ 5 గంటలు పడుతుంది. ఓలా ఎస్ 1 ఎక్స్ 2 కేడబ్ల్యూహెచ్ టాప్ ఫీచర్లలో LED లైట్లు, 4.3-అంగుళాల ఎల్‌సీడీ ఐపీ, ఫిజికల్ కీ, క్రూయిజ్ కంట్రోల్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక డ్యూయల్ షాక్‌లు, ఫ్రంట్, రియర్ డ్రమ్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ అలర్ట్, రివర్స్ మోడ్ ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..