AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి త్వరలో బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం.. మార్చిలో ఫిక్స్.. !

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో షాక్ ఇవ్వనుందా..? అంటే అవుననే వార్తలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. త్వరలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి చివరివారం లేదా మార్చి నెల ప్రారంభంలో ఈ సమావేశం ఉంటుందని తెలుస్తోంది.

EPFO: పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి త్వరలో బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం.. మార్చిలో ఫిక్స్.. !
Epfo 4
Venkatrao Lella
|

Updated on: Feb 05, 2026 | 8:52 AM

Share

దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్లు కలిగి ఉన్నారు. ఈ ఖాతాలతో ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పీఎఫ్ ఖాతాలోని సొమ్ముపై వార్షిక వడ్డీ అందించడంతో పాట 60 ఏళ్లు పూర్తైన తర్వాత నెలనెలా పెన్షన్ కూడా ఇస్తోంది. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్‌వో సౌకర్యంతో ఆర్ధిక భద్రత పొందుతున్నారు. ఇటీవల ఈపీఎఫ్‌వోలో కేంద్రం అనేక సంస్కరణలు చేపుడుతోంది. ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా పీఎఫ్ ఖాతాదారులు ఉపయోగపడేపలా అనేక నిబంధనలను సడలించింది. పీఎఫ్ విత్ డ్రాలను సులభతరం చేయడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా సులువుగా అన్నీ సేవలు పొందేలా త్వరలో కొత్త పోర్టల్‌ను కూడా తీసుకురానుంది. ఈ క్రమంలో పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వడ్డీ తగ్గింపు..?

పీఎఫ్ అకౌంట్లోని డబ్బులపై కేంద్రం ప్రతీ ఏటా వార్షిక వడ్డీ అందిస్తూ ఉంటుంది. ఈ వడ్డీ ఒకేలా ఉండదు. ప్రతీ ఏడాది ఈ వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభానికి ముందే ముందు ఆర్ధిక సంవత్సరానికి ఎంత వడ్డీ ఇవ్వాలనేది కేంద్రం ప్రకటించడం అనవాయితీగా వస్తోంది. త్వరలో 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కానున్న క్రమంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో వడ్డీ రేటును కేంద్రం త్వరలో ప్రకటించనుంది. అయితే ఈ సారి వడ్డీ రేటును తగ్గించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. దీనిని 8.20 శాతం లేదా 8 శాతానికి తగ్గించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చి తొలివారంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది. ఈ సమీక్ష సమావేశంలో వడ్డీని ఫిక్స్ చేయనున్నారని సమాచారం. ఒకవేళ వడ్డీ తగ్గిస్తే పీఎఫ్ అకౌంట్లు ఉన్న కోట్లాది మందికి ఇది పెద్ద షాక్‌ అని చెప్పవచ్చు.

తగ్గనున్న ఆదాయం

వడ్డీ రేటును తగ్గించడం వల్ల పీఎఫ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం తగ్గనుంది. జీతంపై ఆధారపడి జీవించేవారికి ఇది షాక్‌గా చెప్పవచ్చు. తొలుత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో వడ్డీని నిర్ణయించి కేంద్ర ఆర్ధికశాఖకు ప్రతిపాదనలు పంపుతారు. కేంద్రం ఆర్ధికశాఖ నిర్ణయం తీసుకుని ప్రకటించనుంది. అనంతరం కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేస్తుంది. ఈ నోటిఫికేషన్ తర్వాత పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీని జమ చేస్తారు. ఉద్యోగులు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లోకి వెళ్లి వడ్డీని చెక్ చేసుకోవచ్చు. అటు మార్చిలో జరగనున్న సమావేశంలో పీఎఫ్ కనీస వేతన పరిమితిని కూడా పెంచనున్నారని తెలుస్తోంది.

Follow Us
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు
సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?
సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?
ఎందుకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? వాస్తు శాస్త్రం..
ఎందుకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? వాస్తు శాస్త్రం..
పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి అప్పుడే..
మన పూర్వికులు చెప్పిన ఈ ఒక్క డ్రింక్ తో.. బరువు తగ్గడం ఖాయం
మన పూర్వికులు చెప్పిన ఈ ఒక్క డ్రింక్ తో.. బరువు తగ్గడం ఖాయం
లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది
లవర్స్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది
జపం చేస్తున్నా ఫలితం రావట్లేదా? ఈ 7 నియమాలు పాటిస్తే దైవానుగ్రహం
జపం చేస్తున్నా ఫలితం రావట్లేదా? ఈ 7 నియమాలు పాటిస్తే దైవానుగ్రహం
మైగ్రేన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం..?
మైగ్రేన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం..?
స్వీటే కానీ యమ డేంజర్.. నేరేడు తిన్న తర్వాత ఇవి తింటే..
స్వీటే కానీ యమ డేంజర్.. నేరేడు తిన్న తర్వాత ఇవి తింటే..
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మిసెస్ కేరళం హర్ష సన్నీ అరెస్ట్
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మిసెస్ కేరళం హర్ష సన్నీ అరెస్ట్