Bank Loans: బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ రుణాలు తీసుకున్న సమయంలో హిడెన్ చార్జీలు బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. అంటే ముందు చెప్పకుండా తర్వాత వసూలు చేస్తుంటాయి. అలాంటి వాటికి చెక్ పెడుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్(కేఎఫ్ఎస్) పేర్కొనకుండా ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.

Bank Loans: బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
Bank Loan
Follow us

|

Updated on: Apr 19, 2024 | 3:42 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ రుణాలు తీసుకున్న సమయంలో హిడెన్ చార్జీలు బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. అంటే ముందు చెప్పకుండా తర్వాత వసూలు చేస్తుంటాయి. అలాంటి వాటికి చెక్ పెడుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్(కేఎఫ్ఎస్) పేర్కొనకుండా ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఇది 2024, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఇది రిటైల్ వినియోగదారులకు మేలు చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు..

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) జారీ చేసే కీ ఫ్యాక్ట్స్ ప్రకటన (కేఎఫ్ఎస్) సహాయంతో రిటైల్ లోన్ రుణగ్రహీతలు తమ లోన్ మొత్తంపై ఎంత మొత్తం తిరిగి చెల్లించాలనే విషయంపై మరింత స్పష్టత ఉంటుంది. బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు అందించే రుణాలపై కీ ఫ్యాక్ట్స్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్)లో వెల్లడించని అదనపు రుసుములను విధించడాన్ని నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు జారీ చేసిన రుణాలతో సహా అక్టోబర్ 1 నుంచి మంజూరు చేసే అన్ని కొత్త రిటైల్, ఎంఎస్ఎంఈ టర్మ్ లోన్‌ల కోసం ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. కేఎఫ్ఎస్ లో పేర్కొనబడని ఏవైనా రుసుములు, ఛార్జీలు మొదలైనవి రుణగ్రహీత స్పష్టమైన సమ్మతి లేకుండా, రుణం వ్యవధిలో ఏ దశలోనూ రుణగ్రహీత నుంచి ఆర్ఈలు వసూ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను వీలైనంత త్వరగా అమలు చేయడానికి అవసరమైన వ్యవస్థలు, ప్రక్రియలను ఆర్ఈ లు ఏర్పాటు చేస్తాయి. ఏది ఏమైనప్పటికీ, 2024 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత మంజూరు చేసిన అన్ని కొత్త రిటైల్, ఎంఎస్ఎంఈ టర్మ్ లోన్‌లు, ఇప్పటికే ఉన్న కస్టమర్‌లకు తాజా రుణాలతో సహా, ఎటువంటి మినహాయింపులు లేకుండామార్గదర్శకాలను పాటించాలని నోటిఫికేషన్లో ఆర్బీఐ పేర్కొంది.

కీ ఫ్యాక్ట్స్ స్టేట్మెంట్(కేఎఫ్ఎస్) అంటే ఏమిటి?

కేఎఫ్ఎస్ అంటే బ్యాంకుతో రుణ ఒప్పందానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలను వివరించే స్పష్టమైన ప్రకటనగా పనిచేస్తుంది. రుణగ్రహీతలు తమ ఆర్థిక బాధ్యతలను అర్థం చేసుకోవడంలో సహాయపడేందుకు ఇది ప్రామాణిక ఆకృతిలో అందించబడుతుంది. ముఖ్యంగా, కేఎఫ్ఎస్ యాన్యులైజ్డ్ పర్సెంటేజ్ రేట్ (ఏపీఆర్)ని కలిగి ఉంటుంది. ఇది మొత్తం వార్షిక క్రెడిట్ ఖర్చును ప్రతిబింబిస్తుంది. వడ్డీ రేట్లు, అన్ని ఇతర అనుబంధ ఛార్జీలను కలిగి ఉంటుంది.

యాన్యులైజ్డ్ పర్సెంటేజ్ రేట్ (ఏపీఆర్) అంటే ఏమిటి?

యాన్యులైజ్డ్ పర్సెంటేజ్ రేట్(ఏపీఆర్) అనేది రుణగ్రహీతకు క్రెడిట్ కు సంబంధించిన వార్షిక వ్యయం. ఇందులో వడ్డీ రేటు, క్రెడిట్ సౌకర్యంతో కూడిన అన్ని ఇతర ఛార్జీలు ఉంటాయి. వాటిల్లో బీమా చార్జీలు, చట్టపరమైన ఛార్జీలు, ఏవైనా అదనపు రుసుములు అన్ని కలిపి ఉంటాయి. ఈ కేఎఫ్ఎస్, ఏపీఆర్ గణన షీట్లో మీ లోన్ మొత్తం చెల్లింపు వ్యవధి, రుణం పూర్తయ్యే షెడ్యూల్ కూడా అందించాల్సి ఉంటుంది.

ఈ కేఎఫ్ఎస్ అనేది రుణగ్రహీతలకు అర్థమయ్యే భాషలో రాసి ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. అలాగే బ్యాంకులు కేఎఫ్ఎస్ లోని విషయాలను రుణగ్రహీతకు వివరించాల్సి ఉంటుంది. వాటిని అర్థం చేసుకున్నామని రుణ గ్రహీతల నుంచి అంగీకారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..