మళ్లీ ఏటీఎంల నుంచి పెరిగిన నగదు లావాదేవీలు.. ఎంతో తెలుసా..?

30 April 2024

TV9 Telugu

 FY24లో ATMల నుండి భారతదేశం యొక్క నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయని CMS ఇన్ఫోసిస్టమ్స్ నివేదిక చూపిస్తుంది.

ఏటీఎం నుంచి

భారత్‌.. మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నగదు లావాదేవీలు మరింతగా పెరిగిపోతున్నాయి.

నగదు లావాదేవీలు

దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణల సగటు రూ.1.43 కోట్లుగా ఉందని ప్రముఖ క్యాష్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ తెలిపారు.

దేశంలో

ఓవైపు యూపీఐ పేమెం ట్స్‌ రికార్డు స్థాయిలో జరుగుతున్నా.. ప్రజల్లో నగదు వినియోగానికున్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం.

యూపీఐ

ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 2023-24లో ఏటీఎంల్లో 5.51 శాతం క్యాష్‌ విత్‌డ్రాయల్స్‌ పెరిగాయని సీఎంఎస్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ తమ నివేదిక తెలిపింది.

అంతకు ముందు

నాడు రూ.1.35 కోట్లేనని తెలిపింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నగదు ఉపసంహరణలు పెరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. 

మెట్రో నగరాల్లో

 గతంతో చూస్తే 10.37 శాతం పెరిగాయి. సెమీ-అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లో 3.94 శాతం, సెమీ-మెట్రో నగరాల్లోనూ 3.73 శాతం పెరిగాయి.

గతంతో చూస్తే..

న్యూఢిల్లీ (రూ.1.82 కోట్లు), పశ్చిమ బెంగాల్‌ (రూ.1.62 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  రూ.1.83 కోట్లతో కర్నాటక ముందుంది.

కర్ణాటక