AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Sukumar: డైరెక్టర్ సుకుమార్ కూతురు ఆ సినిమాలో నటించిందా ?.. నటనకు అరుదైన గౌరవం..

సుకుమార్ రూపొందించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు దేశమే ఫిదా అయ్యింది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు బన్నీ. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న పుష్ప 2 మూవీపై అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సుకుమార్ కూతురు సుకృతి వేణికి అత్యున్నత పురస్కారం దక్కింది.

Director Sukumar: డైరెక్టర్ సుకుమార్ కూతురు ఆ సినిమాలో నటించిందా ?.. నటనకు అరుదైన గౌరవం..
Sukumar, Sukrithi Veni
Rajitha Chanti
|

Updated on: May 02, 2024 | 6:59 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. పుష్ప మూవీతో పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ రూపొందించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు దేశమే ఫిదా అయ్యింది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు బన్నీ. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న పుష్ప 2 మూవీపై అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సుకుమార్ కూతురు సుకృతి వేణికి అత్యున్నత పురస్కారం దక్కింది. గాంధీ తాత చెట్టు అనే సినిమాలో బాలనటిగా కనిపించింది సుకృతి. ఈ మూవీలో అద్భుతమైన నటన కనబర్చినందుకుగానూ ఉత్తమ బాలనటిగా దాదా సాహేబ్ ఫాల్కే అవార్డ్ అందుకుంది సుకృతి.

మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో సుకృతి తన తల్లి తబితా సుకుమార్‍తో కలిసి హాజరయ్యింది. ప్రస్తుతం సుకృతి వేణి 8వ తరగతి చదువుకుంటుంది. గాంధీ తాత చెట్టు అనే సినిమాలో సుకృతి వేణి బాలనటిగా కనిపించింది. ఈ మూవీ పలు అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. ఇందులో సుకుమార్ తనయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా పలు అవార్డులను కూడా సుకృతి సొంతం చేసుకుంది.

పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశ్యంగా రూపొందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈమూవీ ఉత్తమ బాలనటిగా సుకృతి అవార్డ్ అందుకుంది. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్థానం దక్కించుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం సుకృతి వేణి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.