AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: ఎన్నికల ప్రచారాల్లో వెంకటేశ్ పెద్ద కూతురు.. ఎవరి తరపున అంటే..

ఈసారి ఎన్నికల్లో సినీతారల సందడి ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నటీనటులు ఎన్నికల బరిలో నిలవగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కొందరి తరుపున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే చిరుత హీరోయిన్ నేహాశర్మ తన తండ్రి కోసం కాంగ్రెస్ తరుపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరో వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Venkatesh: ఎన్నికల ప్రచారాల్లో వెంకటేశ్ పెద్ద కూతురు.. ఎవరి తరపున అంటే..
Aashritha Daggubati
Rajitha Chanti
|

Updated on: May 02, 2024 | 7:21 AM

Share

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ నడుస్తోంది. ఓవైపు భానుడి భగభగలు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ ఈసారి ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు మండే ఎండలను లెక్కచేయకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. పోటీలో నిలబడిన నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న పద్దతులను అనుసరిస్తున్నారు. ఓటర్ల మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్ షోస్, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో సినీతారల సందడి ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నటీనటులు ఎన్నికల బరిలో నిలవగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కొందరి తరుపున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే చిరుత హీరోయిన్ నేహాశర్మ తన తండ్రి కోసం కాంగ్రెస్ తరుపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరో వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి కోసం ఆశ్రిత ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఖమ్మం లోక్ సభ స్థానం మీద ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానంపై తీవ్రస్థాయిలో పోటీ ఉంది. ఓవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజీపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేస్తున్నారు. అలాగే ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. హీరో విక్టరీ వెంకటేశ్ ల వియ్యంకుడు రామసహాయం రాఘురామ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అయితే రాఘురామరెడ్డి కోసం వెంకటేశ్ ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపించింది. కానీ వెంకీకి బదులుగా ఆయన పెద్ద కూతురు ఆశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన మీటింగ్‏లో ఆశ్రిత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని సమావేశానికి హజరైన ఆశ్రిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అందురు ఓటు వేసి రఘురామరెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రస్తుతం ఆశ్రిత ఎన్నికల ప్రచార వీడియో నెట్టింట వైరలవుతుంది. అయితే ఎన్నికల ప్రచారం వెంకటేశ్ పాల్గొంటారా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.