Mahindra XUV 3XO: భారత్‌లో మరో ఎక్స్‌యూవీను రిలీజ్ చేసిన మహీంద్రా.. వారే అసలు టార్గెట్

తాజాగా ప్రముఖ కంపెనీ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్ఓ పేరుతో భారతదేశంలో సరికొత్త కారును ప్రారంభించబడింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.49 నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంది. ఎక్స్‌యూవీ 300 సబ్ 4ఎం ఎస్‌యూవీకి సక్సెసర్‌గా కంపెనీ ఎక్స్‌యూవీ 3 ఎక్స్ఓవీని పరిచయం చేసింది. అయితే మహీంద్రా ఈ ధరలో ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ పరిచయం చేయడంతో మార్కెట్‌లో ఈ కారుపై అంచనాలు పెరిగాయి.

Mahindra XUV 3XO: భారత్‌లో మరో ఎక్స్‌యూవీను రిలీజ్ చేసిన మహీంద్రా.. వారే అసలు టార్గెట్
Mahindra Xuv 3xo
Follow us

|

Updated on: May 01, 2024 | 4:23 PM

ఇటీవల కాలంలో భారతదేశంలో కార్లు కొనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మధ్య తరగతి వారిని టార్గెట్ చేస్తూ తక్కువ ధరల్లోనే కార్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్ఓ పేరుతో భారతదేశంలో సరికొత్త కారును ప్రారంభించబడింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.49 నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంది. ఎక్స్‌యూవీ 300 సబ్ 4ఎం ఎస్‌యూవీకి సక్సెసర్‌గా కంపెనీ ఎక్స్‌యూవీ 3 ఎక్స్ఓవీని పరిచయం చేసింది. అయితే మహీంద్రా ఈ ధరలో ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ పరిచయం చేయడంతో మార్కెట్‌లో ఈ కారుపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా భారత మార్కెట్లో కార్ల తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచిన సమయంలో చాలా తక్కువ ధరకు సరికొత్త మరింత అధునాతన ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మహీంద్రా రిలీజ్ చేసి తాజా కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కొత్త ట్రాన్స్‌మి షన్ ఎంపికలు, బాహ్య, అంతర్గత, నవీకరించబడిన ఫీచర్ జాబితాతో వస్తుంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఆవిష్కరించిన కంపెనీ ఈ ఎస్‌యూవీ కోసం ఆన్లైన్ & ఆఫ్‌లైన్‌లో మే 15, 2024 నుండి బుకింగ్‌ను ప్రారంభిస్తుంది. అలాగే మే 26, 2024 నుండి డెలివరీలను ప్రారంభిస్తుందని పేర్కొంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ దాని ‘బోర్న్ ఎలక్ట్రిక్’ శ్రేణిలో మనం గతంలో చూసిన కంపెనీ యొక్క కొత్త డిజైన్ ఫిలాసఫీని కలిగి ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ భవిష్యత్‌లో ఎక్స్‌యూవీ 400కు సంబంధించిన ఈవీ సక్సెసర్ కూడా సేవలు అందిస్తుందని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ 380 కొత్త హెడ్యాంప్ అసెంబ్లీతో కూడిన కొత్త హెడ్ల్యాంప్ అసెంబెల్‌తో ఇంటిగ్రేటెడ్ సీ-ఆకారపు డీఆర్ఎల్‌లు, బై-ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ప్స్‌తో కొత్త రియర్ బంపర్, రియర్ స్పాయిలర్లను కలిగి ఉంది. 

ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ 201 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 350 మిమీ వరకు వాటర్ వేడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీ లోపలి భాగం డ్యాష్ బోర్డ్, డోర్ ట్రిమ్లపై సాఫ్ట్ – టచ్ లెథెరెట్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ డిజిటల్ డిస్ ప్లేలు, పనోరమిక్ సన్రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోబ్బాక్స్, రియర్ వంటి డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌తో ఆకట్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి