AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Ticket: విమాన ప్రయాణికులకు పెద్ద రిలీఫ్.. భారీగా తగ్గనున్న టికెట్ ధరలు.. కారణమిదే..

విమానంలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటారు. ఆకాశంలో ఎగురుతూ, మబ్బులను చూస్తూ ప్రయాణం చేయాలని ఆశ పడతారు. కానీ ఆ కల సాధారణంగా నెరవేరదు. అందుకు ప్రధానం కారణంగా విమాన ప్రయాణం ఖర్చుతో కూడుతున్నది. సామాన్య, మధ్య తరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండదు. అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుభవార్త చెప్పింది.

Flight Ticket: విమాన ప్రయాణికులకు పెద్ద రిలీఫ్.. భారీగా తగ్గనున్న టికెట్ ధరలు.. కారణమిదే..
Flight Ticket
Madhu
|

Updated on: May 01, 2024 | 12:43 PM

Share

విమానంలో ప్రయాణించాలని చాలామంది కలలు కంటారు. ఆకాశంలో ఎగురుతూ, మబ్బులను చూస్తూ ప్రయాణం చేయాలని ఆశ పడతారు. కానీ ఆ కల సాధారణంగా నెరవేరదు. అందుకు ప్రధానం కారణంగా విమాన ప్రయాణం ఖర్చుతో కూడుతున్నది. సామాన్య, మధ్య తరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండదు. అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుభవార్త చెప్పింది. ఈ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విమానం టికెట్ల ధరలు తగ్గనున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

అనవసర సేవలకు చార్జీలు..

విమానంలో ప్రయాణించడానికి మనం నిర్ణీత సొమ్ము చెల్లించి టికెట్ తీసుకుంటాం. దీనిలో ప్రయాణానికి చెల్లించే చార్జీతో పాటు కొన్ని సేవలకు కూడా డబ్బులు వసూలు చేస్తారు. ఆ సేవలు ప్రయాణికులందరికీ అవసరం లేకపోవచ్చు. కానీ టికెట్ తో కలిపి ఉండడం వల్ల తప్పనిసరిగా, అవసరం లేకపోయినా కడుతుంటారు. దీని వల్ల టికెట్ ధర బాగా పెరిగిపోతుంది. విమాన ప్రయాణాన్ని మధ్య తరగతి ప్రజలకు దూరం చేస్తుంది.

మార్గదర్శకాల విడుదల..

అనవసర చార్జీల భారాన్ని పౌర విమానయాన నిఘా సంస్థ గమనించింది. టిక్కెట్ ధరను, సేవల రుసుమును విడదీయడం వల్ల ప్రయాణికులకు మేలు కలుగుతుందని భావించింది. ఈ మేరకు డీజీసీఏ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని అమలు చేయాలని విమానయాన సంస్థలకు ఆదేశించింది.

తగ్గనున్న టికెట్ ధర..

డీజీసీఏ విడుదల చేసిన మార్గదర్శకాలతో విమానం టికెట్ ధర తగ్గుతుంది. ప్రయాణికులు తమకు అవసరమైన సేవలను మాత్రమే ఎంచుకుని వాటికి చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యంగా సేవలను విడదీయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అప్పుడే ప్రయాణికులు తమకు సంబంధించిన సేవలను ఎంపిక చేసుకుంటారు.

టిక్కెట్ ధరలో కలిసి ఉండే సేవలు..

  • ప్రిఫరెన్షియల్ సీటింగ్
  • స్నాక్/డ్రింక్ చార్జీలు (తాగునీరు తప్ప)
  • చెక్-ఇన్ బ్యాగేజీ చార్జీలు
  • క్రీడా సామగ్రి ఛార్జీలు
  • సంగీత వాయిద్యం చార్జీలు
  • విలువైన సామానుకు ప్రత్యేక ప్రకటన కోసం రుసుము.

ఎంపిక చేసుకునే అవకాశం..

గతంలో ఈ సేవలన్ని టికెట్ చార్జీతో కలిసి ఉండేవి. ఉదాహరణకు క్రీడాకారులు తమతో క్రీడా సామగ్రిని తీసుకువెళతారు. సంగీత కళాకారులు వాయిద్యాలను తీసుకువెళతారు. కొందరు ఎక్కువ లగేజీ తో ప్రయాణిస్తారు. గతంలో ప్రతి ప్రయాణికులు వీటన్నింటికీ కలిసి చార్జీలు చెల్లించేవారు. ఇప్పుడు ఎవరికి అవసరమైన సేవలకు వారు చెల్లిస్తే సరిపోతుంది. క్రీడాకారుడు సంగీత పరికరాలకు చెల్లించనక్కర్లేదు. సంగీత కళాకారులు క్రీడా సామగ్రికి డబ్బులు కట్టనవసరం లేదు.

స్పష్టమైన సమాచారం..

ప్రయాణికులు ఈ సేవలు, వాటి చార్జీల గురించి స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలి. అప్పుడే తమకు అవసరమైన సేవలను ఎంపిక చేసుకుంటారు. వారికి అవసరం లేని వాటిని పక్కన పెడతారు. ఈ మార్గదర్శకాలు ఇప్పుడు అమలులో ఉన్నందున, విమానయాన సంస్థలు తమ వెబ్‌సైట్‌లలో పారదర్శకంగా,స్పష్టంగా ప్రదర్శించబడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..