Big Airport: ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!

Big Airport: ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!

Subhash Goud

|

Updated on: May 01, 2024 | 12:25 PM

కొత్తగా నిర్మించనున్న టెర్మినల్‌ను అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా పిలుస్తారు. త్వరలో ప్రపంచ ఎయిర్‌పోర్టు, పోర్టు, అర్బన్‌ హబ్‌, న్యూ గ్లోబల్‌ సెంటర్‌ అందుబాటులోకి రానున్నాయని దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ పేర్కొన్నారు. తదుపరి కార్యకలాపాలు అక్కడనుంచే సాగుతాయని, భవిష్యత్తు తరాల కోసం ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో దుబాయ్‌ (Dubai) ఒకటి. ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న ‘దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌’లోని అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 35 బిలియన్‌ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్‌ నిర్మాణం చేపడుతున్నారు. వచ్చే పది సంవత్సరాలలో నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు శరవేగంగా జరిగే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు దుబాయ్‌ పాలకుడు ప్రకటించారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ప్రసిద్ధి చెందనుంది.

కొత్తగా నిర్మించనున్న టెర్మినల్‌ను అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా పిలుస్తారు. దుబాయ్‌లో త్వరలో ప్రపంచ ఎయిర్‌పోర్టు, పోర్టు, అర్బన్‌ హబ్‌, న్యూ గ్లోబల్‌ సెంటర్‌ అందుబాటులోకి రానున్నాయని దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ పేర్కొన్నారు. తదుపరి కార్యకలాపాలు అక్కడనుంచే సాగుతాయని, భవిష్యత్తు తరాల కోసం ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి